Sai Pallavi : వేణు ఎల్లమ్మలో సాయి పల్లవి..?
Sai Pallavi వేణు తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మని కూడా అరే రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎల్లమ్మ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మంచి బజ్ క్రియేట్
- By Ramesh Published Date - 06:12 PM, Wed - 25 December 24

బలగం (Balagam,) సినిమాతో తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు వేణు యెల్దండి. అప్పటిదాకా అతన్నొక కమెడియన్ గానే చూసిన ఆడియన్స్ అతని డైరెక్షన్ టాలెంట్ కి ఫిదా అయ్యారు. బలగం సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వేణు తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మని కూడా అరే రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎల్లమ్మ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
ఐతే ఎల్లమ్మ సినిమా లో ఆల్రెడీ హీరోగా నితిన్ కన్ఫర్మ్ కాగా.. సినిమాలో ఎల్లమ్మ పాత్రని సాయి పల్లవి చేస్తుందని లేటెస్ట్ టాక్. ఏదైనా సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi,) ఉంది అంటే అది సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క. అందులోనూ ఎల్లమ్మ గా సాయి పల్లవి అనగానే ఆమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
అసలు ఎల్లమ్మ కథ ఏంటి.. వేణు ఆ కథ ఎలా చెప్పబోతున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. వేణు ఎల్లమ్మ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ లో రావడం కన్ఫర్మ్ అయితే మాత్రం ఎల్లమ్మకి ఇంకాస్త క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. 2025 మొదట్లో ఎల్లమ్మ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని త్వరలోనే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తామని అన్నారు వేణు (Venu). బలగం తర్వాత డైరెక్టర్ గా మరింత బాధ్యత ఉంది కాబట్టి ఎల్లమ్మ మీద చాలా ఫోకస్ తో పనిచేస్తున్నా అని అన్నారు వేణు.