Sai Dharam Tej : అభిమాని ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో సాయి తేజ్
తాను స్కూల్ కు వెళ్లానని, అక్కడ తమకు గౌరవం నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించలేదా.. నేర్పించకపోతే నేర్చుకో
- Author : Sudheer
Date : 15-11-2023 - 1:56 IST
Published By : Hashtagu Telugu Desk
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai dharam Tej)..అభిమాని ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. మెగా ఫ్యామిలీ (Mega Family) బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తేజ్..అందరితో చాల సరదాగా ఉంటాడు. సినిమా సెట్స్ లోనే కాదు..బయట ఈవెంట్స్ లలో కూడా అందర్నీ కలుపుకుంటూ మాట్లాడుతుంటుంటాడు. అలాంటి తేజ్ ఆగ్రహానికి గురయ్యాడంటే..ఆయన్ను సదరు అభిమాని ఎంతగా హార్ట్ చేసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. అసలు ఏం జరిగిందంటే..
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం తేజు గాంజా శంకర్(Ganja Shankar) అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో #Asksdt అనే హ్యాష్ ట్యాగ్‌తో తాజాగా చిట్ చాట్ నిర్వహించాడు. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పాడు. ఓ అభిమాని మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని అడిగాడు. దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకు చాలా సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నాడు.
అయితే రిపబ్లిక్(Republic) స్పెల్లింగ్ రిలబ్లిక్ అని తప్పుగా పడింది. దీనిపై మరో నెటిజెన్ సెటైరిక్‌గా స్పందించాడు. అది రిలబ్లిక్(#relublic) కాదురా రిపబ్లిక్.. ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా అని హీరోకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ వ్యాఖ్యలపై తేజ్ వెంటనే స్పందించాడు. తాను స్కూల్ కు వెళ్లానని, అక్కడ తమకు గౌరవం నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించలేదా.. నేర్పించకపోతే నేర్చుకో అని ఘాటుగా బదులిచ్చాడు. దీనికి సదరు నెటిజన్ నన్ను క్షమించు అన్నా.. నీవు రిప్లై ఇవ్వవేమో అని ఇలా రాశాను. నువ్వుంటే చాలా ఇష్టం అని రాసుకొచ్చాడు. దీనిపై మరికొందరు అభిమానులు స్పందించారు. ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదు బ్రదర్ అని బదులిస్తున్నారు.
Read Also : Nirudyoga Chaithanya Yatra : మరికాసేపట్లో మొదలుకానున్న నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర