RRR బిహైండ్ & బియాండ్..త్వరలో డాక్యుమెంటరీ రిలీజ్..!
RRR బిహైండ్ & బియాండ్ డాక్యుమెంటరీలో అసలు ఏముంటుంది. ఈ డాక్యుమెంటరీ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ అందిస్తుంది అన్నది చూడాలి. ఐతే ఈమధ్యనే రాజమౌళి గురించి నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ
- By Ramesh Published Date - 03:18 PM, Mon - 9 December 24

RRR సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి చేసిన ప్రమోషన్స్ అది అందుకున్న అవార్డులు రివార్డులు తెలిసిందే. ఐతే ట్రిపుల్ ఆర్ సినిమా లో చరణ్, తారక్ లను ఒప్పించడమే ఆ ఇద్దరిని కలిపి సినిమా చేయడమే రాజమౌళి సక్సెస్ అయ్యాడు. అంతేకాదు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి విమర్శలు గొడవలు రాకుండా బ్యాలెన్స్ చేసి అదరగొట్టాడు.
ఐతే RRR సినిమా కథ పూర్తైంది అనుకుంటే పొరబడినట్టే. త్వరలో RRR నుంచి ఒక డాక్యుమెంటరీ రాబోతుంది. RRR సినిమాకు సంబందించిన బిహైండ్ ఇంకా బియాండ్ స్టోరీని రాజమౌళి చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. సో ఈ డాక్యుమెంటరీ కూడా అందులోనే వస్తుందేమో చూడాలి.
ఐతే RRR బిహైండ్ & బియాండ్ డాక్యుమెంటరీలో అసలు ఏముంటుంది. ఈ డాక్యుమెంటరీ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ అందిస్తుంది అన్నది చూడాలి. ఐతే ఈమధ్యనే రాజమౌళి గురించి నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీసింది. అది మన దగ్గర పెద్దగా చూడలేదు కానీ బయట బాగానే చూశారు. మరి ఈ RRR బిహైండ్ & బియాండ్ డాక్యుమెంటరీ ఎలా ఉంటుందో చూడాలి.
సైలెంట్ గా ఎలాంటి హంగామా లేకుండా ఈ డాక్యుమెంటరీ గురించి అనౌన్స్ చేశారు రాజమౌళి అండ్ టీం. RRR డాక్యుమెంటరీ అనగానే మళ్లీ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.