RRR@Oscar: ఆర్ఆర్ఆర్ వర్సెస్ కాశ్మీర్ ఫైల్స్.. ఆస్కార్ బరిలో నిలిచేది ఏది?
ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ మేకర్లు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాలో
- By Nakshatra Published Date - 09:18 AM, Fri - 19 August 22
ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ మేకర్లు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాలో షాట్స్,ఎలివేషన్స్, పిక్చరైజేషన్ గురించి మాట్లాడుతూ అవాక్కయ్యారు. హాలీవుడ్ జనాలను ఆర్ఆర్ఆర్ మెప్పించేసింది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ మీద కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. ఇదొ గే సినిమా అంటూ నానా రకాలుగా ట్రోలింగ్ చేశారు. అయితే జనాలు మాత్రం ఆర్ఆర్ఆర్ను నెత్తిన పెట్టేసుకుంటున్నారు.
ఇక ఇప్పుడు అంతర్జాతీయ మేగజైన్ వెరైటీ అదిరిపోయే ప్రకటన చేసింది. ఈ సారి ఆస్కార్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ కానుందని, ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్‌గా నామినేట్ అవుతాడని రాసేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ మీద ఒక్కసారిగా చర్చ మొదలైంది.దీనిపై బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు.అయితే ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ అయితే ఇంకా రాలేదు.
ఒక వేళ ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తే.. ఆర్ఆర్ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్‌ను కూడా పంపిస్తారేమోనని చెప్పుకొస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ మీద ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం హాలీవుడ్ జనాలను మెప్పించిందని కితాబిచ్చాడు. ఒక వేళ ఆస్కార్ వరకు నామినేట్ అయితే.. కచ్చితంగా అవార్డులు వచ్చే అవకాశం ఉందని, అయితే ది కాశ్మీర్ ఫైల్స్‌ను పంపించి.. ఆర్ఆర్ఆర్ను మన ప్రభుత్వాలు ఆపినా కూడా.. వేరే కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను నామినేట్ అయ్యే ఆస్కారం ఉందంటూ అనురాగ్ చెప్పుకొచ్చాడు.
Related News
RGV : ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకులతో ఆర్జీవి..!
RGV నిన్న మొన్నటిదాకా పొలిటికల్ ఎజెండాతో కొన్ని సినిమాలు చేసి సందడి చేసిన సంచలన దర్శకుడు ఆర్జీవి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి తను కూడా ఇప్పుడు ఒక దర్శకుడిని