Jabardast Ramprasad : జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌కు రోడ్డు ప్రమాదం
Jabardast Ramprasad : హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ (Tukkuguda) సమీపంలో ఈ ఘటన జరిగింది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో రాంప్రసాద్ కారు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడం తో..రామ్ ప్రసాద్ కార్ ఆ కారు ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనుకనుంచి వచ్చిన ఓ ఆటో ఆయన కారును ఢీకొట్టింది
- By Sudheer Published Date - 03:50 PM, Thu - 5 December 24

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ (Jabardast Ramprasad) రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యారు. హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ (Tukkuguda) సమీపంలో ఈ ఘటన జరిగింది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో రాంప్రసాద్ కారు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడం తో..రామ్ ప్రసాద్ కార్ ఆ కారు ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనుకనుంచి వచ్చిన ఓ ఆటో ఆయన కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే రామ్ ప్రసాద్ ను స్థానిక హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం రాంప్రసాద్ కు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. అభిమానులు ఈ వార్త తెలుసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాంప్రసాద్ కారు ముందు వాహనం తగలడంపై, వెనక నుంచి ఆటో ఢీకొట్టడంపై స్పష్టతకు రోడ్డు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇక రామ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని తోటి నటి నటులు , అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also : Retrofitted Handicapped Motor Vehicles: ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల పంపిణీ.. అర్హతలు ఏంటంటే?