RGV ‘సిండికేట్’..ఏమవుతుందో..?
RGV : అలాంటి మోస్ట్ పాపులర్ డైరెక్టర్..ఇప్పుడు చెత్త డైరెక్టర్ గా మారిపోయాడు
- By Sudheer Published Date - 05:07 PM, Wed - 22 January 25

రామ్ గోపాల్ వర్మ (RGV) ఒకప్పుడు ఈయనంటే చిత్రసీమకు అభిమానులకు , సినీ లవర్స్ కు ఎంతో అభిమానం ఉండేది. ఈయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన వారు ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. అంతే ఎందుకు వర్మ నుండి సినిమా అంటే అగ్ర దర్శకుల నుండి సినీ లవర్స్ వరకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలసిందే అని ఫిక్స్ అయ్యేవారు. అలాంటి మోస్ట్ పాపులర్ డైరెక్టర్..ఇప్పుడు చెత్త డైరెక్టర్ గా మారిపోయాడు. వివాదాలకు కేరాఫ్ గా మారిపోయి , అర్ధం పర్థం లేని సినిమాలు చేసి తన బ్రాండ్ ను మొత్తం పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు వర్మ తో సినిమాలు చేయాలనీ పోటీ పడే నిర్మాతలు..ఇప్పుడు వర్మ తో సినిమా చేస్తే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావనే మాటకు వచ్చేసారు. ఆ రేంజ్ లో వర్మ దిగజారిపోయాడు. ఇప్పుడు తన తప్పులు తెలుసుకొని మళ్లీ తన సత్తా ఏంటో చూపిస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లో బుమ్రా, జడేజా
మరోసారి సత్య సినిమా చూసాక తనలో ఒక రియలైజేషన్ వచ్చిందని ఒక సుదీర్ఘ నోట్ రాసుకొచ్చాడు. “2 రోజుల క్రితం వరకు లక్ష్యం లేని గమ్యం వైపు నా ప్రయాణం సాగింది. సత్య సినిమా చూసాకా.. హోటల్‌కు తిరిగి వచ్చి, చీకటిలో కూర్చున్నప్పుడు నాకు అర్థం కాలేదు. నా అంతటి తెలివితేటలతో, భవిష్యత్తులో నేను ఏమి చేయాలో ఈ సినిమాను ఒక బెంచ్‌మార్క్‌గా ఎందుకు సెట్ చేయలేదు అని ఆలోచించాను. నా జిమ్మిక్కులతో, టెక్నాలజీతో ప్రేక్షకులను మెప్పించాలని నా అతి తెలివితో అసభ్యకరమైన సన్నివేశాలు జోడించి చాలా సినిమాలు తీసాను. అర్థపర్థం లేని కథలతో సినిమాలు తీసాను. దానికి నేను ఎంతో ఏడ్చాను. కానీ, రెండురోజుల క్రితం నా కళ్ల నీళ్లు తుడుచుకొని నాకు నేనే ఒక హామీ ఇచ్చుకున్నాను. ఇప్పటి నుండి నేను తీసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవం పెంచేలా తీస్తాను” అని చెప్పుకొచ్చాడు.
చెప్పడమే కాదు సిండికేట్ (Syndicate) అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ” ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. నా సినిమా పేరు సిండికేట్ అని తెలిపాడు. సిండికేట్ అనేది సుదూర భవిష్యత్తులో సెట్ చేయని భవిష్యత్ కథ. ఉదాహరణకు, సెప్టెంబర్ 11, 2001న ప్రపంచం మొత్తం ఆల్ఖైదాతో నిద్ర లేచింది. కానీ ఈ విషయం సెప్టెంబర్ 10 వరకు కూడా ఎవరికి తెలియదు.సిండికేట్ చిత్రం ఒక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సిండికేట్ ఎలాంటి సూపర్ పవర్స్ లేని చాలా ప్రమాదకరమైన సినిమా. కానీ, ఒక మనిషి భయంకరంగా ఏమి చేయగలడు అని చూపిస్తుంది. ఈ చిత్రం క్రైమ్ మరియు టెర్రర్ యొక్క స్వభావాన్ని లోతుగా చూపిస్తుంది.
క్రైమ్ మరియు టెర్రర్ ఎప్పటికీ చనిపోవు అనే చీకటి సత్యాన్ని రుజువు చేస్తుంది. వారు మరింత ఘోరమైన ఫార్మ్స్ లో తిరిగి వస్తారు.సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు మరియు ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించబడతాయి” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ లో ఎవరు హీరో , కాస్ట్ & క్రూ ఎవరు..? ఎవరు నిర్మిస్తున్నారు..? అనేది తెలియాల్సి ఉంది.
“ONLY MAN CAN BE THE MOST TERRIFYING ANIMAL “
In CONTINUATION to my CONFESSION note on SATYA film , I DECIDED to make the BIGGEST film ever
The film is called SYNDICATE
It’s about a terrifying organisation which threatens the very EXISTENCE of INDIA
The CONCEPT
STREET…
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2025