Prabhas Birthday: నో సెలబ్రేషన్స్ ప్లీజ్.. ఫ్యాన్స్ కు ప్రభాస్ రిక్వెస్ట్!
రెబల్ స్టార్ కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా
- By Balu J Published Date - 10:44 PM, Sat - 22 October 22

రెబల్ స్టార్ కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు ఆదివారం తన పుట్టినరోజున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని అభిమానులకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ సాధారణంగా బర్త్ డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటాడు. స్నేహితులు కేక్ కట్ చేయమని బలవంతం చేస్తే నో అని చెప్పలేక సెలబ్రేషన్ చేసుకుంటాడు. కానీ కృష్ణంరాజు మరణంతో బాధలో ఉన్నందున వేడుకలు చేసుకోవద్దని అభిమానులకు సందేశం పంపినట్లు తెలుస్తోంది. కానీ ప్రభాస్ అభిమానుల కోసం బిల్లా మూవీ మరోసారి రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘సాలార్’, ‘ఆదిపురుష’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లో నటిస్తున్నారు. మారుతితో కూడా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రాజెక్ట్ కే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. ప్రభాస్ అభిమానులకు ఆనందాన్నిచ్చే వార్తను అశ్విన్ ఇచ్చాడు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
Here's #Billa Special Trailer ▶️ https://t.co/pDDbGk5yLd#Prabhas' Birthday Special Shows of #Billa4K on October 23rd Worldwide 🔥#KrishnamRajuGaru #ForeverInOurHearts ❤️@MeherRamesh @GopiKrishnaMvs @MsAnushkaShetty @actorsubbaraju @PraseedhaU #Billa4K pic.twitter.com/AptXe0cOqM
— Gopi Krishna Movies (@GopiKrishnaMvs) October 20, 2022