Anchor Rashmi: గోదావరిలో అస్థికలు కలిపుతూ ఎమోషనల్ అయిన యాంకర్ రష్మీ.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ జబర్దస్త్ యాంకర్ రష్మీ తాజాగా గోదావరిలో అస్థికలను కలుపుతూ ఎమోషనల్ అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- By Anshu Published Date - 01:00 PM, Mon - 10 March 25

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మీ ప్రస్తుతం వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో లతో పాటు అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో కూడా సందడి చేస్తోంది. తనకు వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. ఒకవైపు యాంకరింగ్ తో అలరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ ఆ ఫోటోలు ఏంటి అసలు ఏం జరిగింది అన్న విషయానికి వస్తే.. తాజాగా యాంకర్ రష్మీ అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా రష్మి ఎవరి అస్థికలు గోదావరి నదిలో కలిపిందో తెలుసా? యాంకర్ రష్మీ తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలు గోదావరి నదిలో కలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మీ పెంపుడు కుక్క చుట్కీ మరణించింది. గతంలోనే రష్మీ ఈ విషయాన్ని తెలిపి ఎమోషనల్ అయింది. తాజాగా తాను ఎంతగానో ప్రేమగా చూసుకున్న కుక్క చుట్కీ అస్థికలు రాజమండ్రికి తీసుకు వచ్చి గోదావరి నదిలో కలిపింది.
ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోని షేర్ చేసి రష్మీ.. నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. కొందరు మాత్రం నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. కాగా యాంకర్ రష్మీకి కుక్కలు అంటే ప్రేమ అని తెలిసిందే. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో కుక్కల గురించి పోస్టులు చేస్తూ ఉంటుంది. రోడ్డు పై అనాథ కుక్కలకు ఫుడ్ పెడుతుందట. పలు కుక్కలను పెంచుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే.