Ram Puri Jagannath : డబుల్ ఇస్మార్ట్.. ఈ డేట్ కు ఫిక్స్ అయారా..?
Ram Puri Jagannath రామ్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈసారి డబుల్ ట్రీట్ అందించేలా డబుల్ ఇస్మార్ట్ అంటూ
- Author : Ramesh
Date : 16-02-2024 - 9:12 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Puri Jagannath రామ్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈసారి డబుల్ ట్రీట్ అందించేలా డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నారు. సినిమా లాస్ట్ ఇయర్ మొదలు పెట్టే టైం కే ఈ ఇయర్ మార్చి 8న రిలీజ్ లాక్ చేశారు. కానీ సినిమా అనుకున్న టైం కు పూర్తి చేయడం కుదరక అనుకున్న డేట్ కి కాకుండ మరో డేట్ ని చూస్తున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూరీ జగన్నాథ్ జూన్ 14న రిలీజ్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ రామ్ ఇద్దరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. సినిమాలో భారీ యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్ టైన్ చేస్తాయని అంటున్నారు.
రీసెంట్ గా ముంబైలో భారీ బడ్జెట్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేశారట. సినిమాలో సంజయ్ దత్ విలన్ గా చేస్తుండగా అనుకున్న దానికన్నా భారీగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా అనుకున్న విధంగా జూన్ 14న వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయట్లేదు.
Also Read : Prabhas Kalki : కల్కి పై క్లారిటీ రావాల్సిందే..!