Ram Puri Jagannaath : డబుల్ ఇస్మార్ట్ కచ్చితంగా కొట్టాల్సిందే..!
Ram Puri Jagannaath డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్
- Author : Ramesh
Date : 13-05-2024 - 2:44 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Puri Jagannaath డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి ఆ సినిమా సీక్వల్ తో వస్తున్నారు. రామ్ , పూరీ జగన్నాథ్ ఇద్దరి కెరీర్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. డబుల్ ఇస్మార్ట్ సినిమా తో పూరీ జగన్నాథ్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. లేకపోతే డైరెక్టర్ గా పూరీ పరిస్థితి డైలమాలో పడుతుంది.
రామ్ కూడా ది వారియర్, స్కంద సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు అందుకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన పూరీ సినిమాను అక్కడ ఆడియన్స్ కు నచ్చేలా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా రేంజ్ పెంచే భాగంలోనే విలన్ గా సంజయ్ దత్ ని తీసుకున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద హీరోగా రామ్, డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ సత్తా చాటాల్సి ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా సరే కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది. లైగర్ ఫ్లాప్ తో పూరీతో సినిమా అంటే ఎవరు డేర్ చేయలేదు కానీ రామ్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ అనుకున్న రేంజ్ లో హిట్ అయితే మాత్రం పూరీ, రామ్ ఇద్దరిది ఇస్మార్ట్ హిట్ కాంబో అవుతుందని చెప్పొచ్చు.
ఈ సినిమాకు సంబందించిన టీజర్ రామ్ బర్త్ డే మే 15న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈసారి కూడా దిమాక్ కిరికిరి చేసేందుకు పూరీ రామ్ కలిసి రచ్చ చేయనున్నారని టాక్.
Also Read : Deepika Padukone : కల్కి కోసం దీపికా అలాంటి పనిచేస్తుందా..?