Deepika Padukone : కల్కి కోసం దీపికా అలాంటి పనిచేస్తుందా..?
Deepika Padukone రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం
- By Ramesh Published Date - 02:35 PM, Mon - 13 May 24

Deepika Padukone రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు గాను దీపికా పదుకొనె 10 కోట్ల పైన రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
లేటెస్ట్ గా దీపికా పదుకొనే సినిమాకు తన డబ్బింగ్ పూర్తి చేసిందని తెలుస్తుంది. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. అందుకే తెలుగు, హిందీ భాషల్లో దీపికా సొంత డబ్బింగ్ చెప్పేలా ప్లాన్ చేశారట. తెలుగు సరిగా రాకపోయినా సరే దీపికా తన టీం సహాయంతో కల్కి 2898 ఏడి డబ్బింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో దీపికా పదుకొనెతో పాటుగా దిశా పటాని కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ ఇలా భారీ స్టార్ కాస్టింగ్ తో కల్కి వస్తుంది. సినిమా పై ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వస్తారో దానికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
కల్కి సినిమాను నాగ్ అశ్విన్ ఏడు భాగాలుగా తీయాలని ప్లాన్ చేశాడట. కల్కి 2898 ఏడి మొదటి భాగమని తెలుస్తుంది. సో ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చాలా పెద్ద ప్లానే వేశాడని చెప్పొచ్చు.