Ram Parasuram : పరశురామ్ కి ఆఫర్ ఇస్తున్న ఇస్మార్ట్ హీరో.. డబుల్ ఇస్మార్ట్ తర్వాత అతనితోనే ఫిక్స్..!
Ram Parasuram ఇస్మార్ట్ హీరో రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ఎక్కువశాతం
- By Ramesh Published Date - 04:46 PM, Tue - 30 April 24
Ram Parasuram ఇస్మార్ట్ హీరో రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ఎక్కువశాతం షూటింగ్ ముంబైలోనే జరుగుతుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాను అసలైతే ఈ ఇయర్ మార్చ్ లోనే రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త జూన్ కి వాయిదా పడింది. సినిమాలో యాక్షన్ సీన్స్ అనుకున్న దానికన్నా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ ఎవరితో చేస్తాడన్నది ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. దానికి సమాధానం దాదాపు దొరికేసినట్టే అని అంటున్నారు. రామ్ నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ తో ఉంటుందని అంటున్నారు. యువత సినిమా నుంచి పరశురాం ఎప్పుడు తన టార్గెట్ మిస్ అవ్వలేదు. అయితే ది ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశపరచింది.
ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో కొన్ని అంశాలు బాగున్నా పరశురాం మాత్రం అన్ని విధాలుగా ఫెయిల్ అయినట్టే అని చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ స్టార్ తర్వాత అతనికి ఎవరు ఛాన్స్ ఇస్తారా అని అనుకున్నారు కానీ రామ్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.
రామ్ కోసం పరశురాం ఒక అద్భుతమైన కథ రాసుకున్నాడట. త్వరలోనే కథా చర్చలు జరిగి సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. ది వారియర్, స్కంద ఫ్లాపుల తర్వాత రామ్ డబుల్ ఇస్మార్ట్ మీద తన హోప్స్ పెట్టుకున్నాడు.
Also Read : Malavika Mohanan : సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ పరువు తీసేశారుగా..?