Ram Charan fans: డైరెక్టర్ శంకర్ పై రామ్ చరణ్ అభిమానులు సీరియస్.. కారణమిదే!
పాటలు, ఫైట్స్ లు శంకర్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తుండటం విశేషం.
- Author : Balu J
Date : 16-08-2023 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలకే కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమాలు సెట్స్ పై ఉన్నాయంటే ఓ రేంజ్ లో అంచనాలను భారీస్తాయికి తీసుకెళ్తాడు. ఇక పాటలు, ఫైట్స్ లు శంకర్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తుండటం విశేషం. ఒకటి కమల్ మూవీ అయితే, మరొకటి రామ్ చరణ్ మూవీ ఉండటం గమనార్హం.
అయితే దర్శకుడు శంకర్ తాజాగా సోషల్ మీడియా లో రెండు ఫోటోలను పోస్ట్ చేశాడు. “భారతీయుడు 2” నుండి కమల్ హాసన్ చిత్రం ఒకటి. మరొకటి “గేమ్ ఛేంజర్” మూవీ వర్కింగ్ స్టిల్. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న ఈ రెండు చిత్రాల ద్వారా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శంకర్. అయితే, తమ అభిమాన నటుడి ఫొటోలను ఎందుకు విడుదల చేయలేదంటూ రామ్ చరణ్ అభిమానులు శంకర్ ను విమర్శించడం మొదలుపెట్టారు.
శంకర్ “ఇండియన్ 2” నుండి కమల్ హాసన్ స్టిల్‌ను విడుదల చేసి, రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” మూవీ స్టిల్ ను విడుదల చేయకపోవడంతో అభిమానులు శంకర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ వర్కింగ్ స్టిల్ కాకుండా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫొటోను పోస్ట్ చేసే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.
HAPPY INDEPENDENCE DAY from the sets of #GameChanger pic.twitter.com/w5t1nzmHWj
— Shankar Shanmugham (@shankarshanmugh) August 15, 2023
Also Read: Fertility Rates: తగ్గుతున్న సంతానోత్పత్తి.. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టు తిరుగుతున్న జంటలు!