Peddi : రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకు.. పుష్ప 2 ని మించి..?
ఇటీవలే పెద్ది సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 09:45 AM, Wed - 2 April 25

Peddi : రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాగా ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. అనుకున్నంత భారీ హిట్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేసుకొని మూడో షెడ్యూల్ షూట్ చేస్తుంది.
ఇటీవలే పెద్ది సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమా గ్లింప్స్ ని ఏప్రిల్ 6న శ్రీరామనవమికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ పెద్ది గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా పెద్ది ఆడియో రైట్స్ పై ఆసక్తికర రూమర్ వినిపిస్తుంది.
రామ్ చరణ్ పెద్ది సినిమా అన్ని భాషల ఆడియో రైట్స్ కలిపి దాదాపు 35 కోట్లకు టీ సిరీస్ సంస్థ కొనుక్కుందని సమాచారం. సినిమాపై హైప్ ఉండటం, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా కావడం, ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఈ రేంజ్ డబ్బులు పెట్టి ఆడియో రైట్స్ కొన్నారట. గతంలో పుష్ప 2 సినిమా ఆడియో రైట్స్ అన్ని భాషలు కలిపి 30 కోట్లకు కొన్నట్టు టాలీవుడ్ టాక్. దీంతో ఆడియో రైట్స్ విషయంలో పెద్ది సినిమా పుష్ప 2 సినిమాని బీట్ చేసిందని అంటున్నారు. ఈ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Upasana : HCU అటవీ భూములపై వివాదం.. స్పందించిన రామ్ చరణ్ భార్య..