Ram Charan : అలా అయ్యేవరకు RC16 షూటింగ్ మొదలు కాదట..!
గేమ్ ఛేంజర్ చిత్రీకరణ కూడా పూర్తీ అయ్యింది. ఇక RC16 షూటింగ్ కి ఏ ఇబ్బంది లేదు అనుకుంటే.. మరో కొత్త అడ్డంకి వచ్చిందే.
- Author : News Desk
Date : 21-07-2024 - 4:43 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు సనాతో ప్లాన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ చిత్రం.. రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం మొదలు పెట్టుకోలేదు. మొన్నటివరకు చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో.. ఈ సినిమా షూటింగ్ ఇబ్బంది అయ్యింది. అయితే చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రీకరణని కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో RC16 షూటింగ్ మొదలు కాబోతుందని ఫ్యాన్స్ సంబర పడ్డారు.
అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరో అడ్డంకి కూడా ఉందట. అదే రామ్ చరణ్ బాడీ మేక్ ఓవర్. ఈ సినిమాలో రామ్ చరణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ బాక్సర్ గెటప్ కి తగ్గట్లు బాడీ పెంచాల్సి ఉంటుందట. అంతేకాదు, గెడ్డం మీసం కూడా పెంచాల్సి ఉంటుందట. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ మేక్ ఓవర్ పైనే ఫోకస్ పెట్టారట. బుచ్చిబాబు అనుకున్న గెటప్ వస్తేనే సినిమా షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. దింతో ఇప్పుడు భారం అంతా చరణ్ పై పడింది.
కాగా బుచ్చిబాబు అనుకున్న మేక్ ఓవర్ కి వచ్చేందుకు రామ్ చరణ్ సెప్టెంబర్ వరకు సమయం పెట్టుకున్నట్లు సమాచారం. ఆలోపు అవసరమైన కసరత్తులు చేసి చరణ్ బాడీ బిల్డుప్ చేయనున్నారట. మరి చరణ్ సెట్ చేసుకున్న ఆ టైంకి అంతా ఓకే అవుతుందా లేదా చూడాలి. కాగా ఈ మూవీలో కన్నడ మెగాస్టార్ శివ రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర చేస్తుంటే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు మ్యూజిక్ సిట్టింగ్స్ పై ఫోకస్ పెట్టారు.