Virat Kohli & Ram Charan: విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!
- By Balu J Published Date - 11:15 AM, Sat - 18 March 23

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ (Ram Charan) గ్లోబర్ స్టార్ ట్యాగ్ ను గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం ఆర్ఆర్ఆర్ ప్రశంసలు మాత్రమే కాకుండా.. ఆస్కార్ అవార్డ్ ను సైతం కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సీతరామరాజు పాత్రలో అదరగొట్టి రామ్ చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రంగస్థలం, మగధీర లాంటి ప్రతిష్టాత్మక పాత్రల్లో నటించిన రామ్ చరణ్ బయోపిక్ లోనూ నటించాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు అవకాశం ఇస్తే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పాత్రను పోషించడానికి ఇష్టపడతానని చెప్పాడు.
“నేను క్రీడకు సంబంధించి ఏదైనా సినిమా చేయాలనుంది. చాలా కాలంగా స్పోర్ట్స్ బేస్డ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. బహుశా క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా కావచ్చు” అని రామ్ (Ram Charan) స్పష్టం చేశాడు. తాను నటించడానికి ఇష్టపడే పాత్ర గురించి చెప్పాడు. చరణ్ కు విరాట్ పేరును సూచించినప్పుడు.. ఒక అవకాశం వస్తే, నేను కూడా కోహ్లీలా నటించి పరుగుల వరద పారించాలని ఉంది. మా ఇద్దరి పోలికలు ఒకేలా ఉంటాయి. ఇక గడ్డం కూడా ఒకే స్టైల్ లో ఉంటుంది’’ అని చరణ్ చెప్పాడు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ (Ram Charan) కరెక్ట్ సూట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేశాక గ్రౌండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అయితే ఆ సమయంలో విరాట్ వెనుక నుంచి డాన్స్ చేస్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవ్వగా.. ఆయన అభిమానులు అబ్బో స్టెప్పులు మామూలుగా వేయలేదు కదా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Global Star @AlwaysRamCharan at India's Biggest Conclave #IndiaTodayConclave 🔥#INDIAsPrideRAMCHARANpic.twitter.com/BQ6Uls0w70
— Trends RamCharan™ (@TweetRamCharan) March 17, 2023
Also Read: Sai Dharam Tej: కథను జడ్డ్ చేశాడు.. ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు

Related News

Kohli Comments on Costly Cars: ఇష్టమొచ్చినట్టు కార్లు కొనేసా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
మన దేశంలో క్రికెటర్ల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియాకు ఆడుతుంటే సంపాదన ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ అయితే