Sai Dharam Tej: కథను జడ్డ్ చేశాడు.. ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు
- By Balu J Published Date - 10:42 AM, Sat - 18 March 23

తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా నాగశౌర్య కంటే ముందు సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్లింది. శౌర్య కంటే ముందు సాయిధరమ్ తేజ్ కు కథ చెప్పాడు అవసరాల శ్రీనివాస్. కథ మొత్తం విన్న సాయిధరమ్ తేజ్, అందులో నటించనని చెప్పేశాడు.
ఆ తర్వాత ఈ కథ నాగశౌర్య వద్దకు వెళ్లింది. అప్పటికే అవసరాలతో 2 సినిమాలు చేసిన నాగశౌర్య, అతడిపై నమ్మకంతో కావొచ్చు లేదా మొహమాటంతో కావొచ్చు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడా ఫలితం వచ్చేసింది. మూవీ ఫ్లాప్ అయింది. దీంతో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ ఫ్లాప్ సినిమా నుంచి సాయిధరమ్ తేజ్ తప్పించుకున్నాడని, మొహమాటానికి పోయి నాగశౌర్య ఫ్లాప్ తెచ్చుకున్నాడని చర్చించుకుంటున్నారు.

Related News

Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?
ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత.