HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Game Changer Airport Scene Video Leaked

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ నుంచి రామ్ చరణ్ వీడియో లీక్.. రిలీజ్‌కి ముందే..

'గేమ్ ఛేంజర్' నుంచి రామ్ చరణ్ వీడియో లీక్. దాదాపు నిమిషం పాటు ఉన్న ఎయిర్ పోర్ట్ సీన్ వీడియో..

  • Author : News Desk Date : 16-07-2024 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan, Game Changer, Rc16
Ram Charan, Game Changer, Rc16

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గత మూడేళ్లుగా చిత్రకరణ జరుపుకుంటూనే వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రామ్ చరణ్ కి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది. ఇక ఇతర పాత్రలకు సంబంధించిన బ్యాలన్స్ షూట్ పది రోజులు చేయాల్సి ఉందని శంకర్ ఇటీవల తెలియజేసారు. ప్రస్తుతం ఆ షూటింగ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతూనే వస్తున్నాయి. సినిమా రిలీజ్ కి ముందే మొత్తం సినిమా అంతా లీకులతో సోషల్ మీడియాలో చూపించేలా ఉన్నారు. ఆ మధ్య హెలికాఫ్టర్ సీన్, ఆ తరువాత చరణ్ కారు పై కూర్చొని వెళ్తున్న సీన్, ఇక తాజాగా ఎయిర్ పోర్ట్ సీన్. దాదాపు నిమిషం పాటు ఉన్న ఎయిర్ పోర్ట్ సీన్ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఆ సీన్ లో చరణ్ కూడా కనిపిస్తున్నారు. ఇవే కాదు, సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలా సీన్స్ లీక్ అవుతూనే వచ్చాయి. అయితే మూవీ టీం మాత్రం, దీని పై ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు.

కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి, ఫైనల్ ఎడిట్ ఓకే అయినప్పుడే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ శంకర్ తెలియజేసారు. ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారట.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • ram charan
  • RC16

Related News

Ram Charan-Sukumar Film

సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

గతంలో సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ కలిసి పని చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

    Latest News

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

    • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd