Rakul Preet Singh: పెళ్ళికి ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన రకుల్,జాకీ భగ్నానీ.. ఫోటోస్ వైరల్?
- Author : Sailaja Reddy
Date : 18-02-2024 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ ఇద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈనెల 21వ తేదీన గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా ఈ జంట పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఏర్పాట్లను మరింత వేగవంతం చేసేసారు. అందులో భాగంగానే పెళ్లికి ముందు తాజాగా ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించారు రకుల్, జాకీ.
ఇద్దరూ కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి పత్రికను తీసుకెళ్లి వినాయకుడి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా రకుల్, జాకీ ఆలయంలోకి వెళుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ సందర్భంగా పింక్ అనార్కలీ డ్రెస్ లో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించింది రకుల్. అలాగే సన్ గ్లాసెస్ లో ఎంతో స్టైలిష్ గా దర్శనమిచ్చింది పెట్టుకున్నారు రకుల్. ఇక ప్యారెట్ గ్రీన్ కుర్తా ధరించి ఆలయానికి వచ్చాడు జాకీ. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Blessings before the big day❣️ Rakul Preet and Jackie Bhagnani snapped at Siddhivinayak temple🤩✨#rakulpreet #jackeybhagnani pic.twitter.com/doeMd751js
— Viral Bhayani (@viralbhayani77) February 17, 2024
మరి కొన్ని రోజుల్లో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముచ్చటైన జంట, సూపర్ జోడి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా ఫిబ్రవరి 21న రకుల్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు జాకీ. అయితే ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసి సినీ ప్రముఖులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ పెళ్లిని పర్యావరణ హితంగా చేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పటాకులు పేల్చకూడదని ఫిక్స్ అయ్యారు. అలాగే పేపర్ వేస్ట్ లేకుండా అతిథులందరికీ కేవలం డిజిటల్ ఇన్విటేషన్ కార్డులను మాత్రమే అందిస్తున్నారు. రకుల్,జాకీ వివాహ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.