Rajinikanth : వేటయ్యన్ సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తుందిగా..!
Rajinikanth దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లేటెస్ట్ గా రిలీజైంది.
- By Ramesh Published Date - 08:19 AM, Wed - 11 September 24

జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజినికాంత్ తన నెక్స్ట్ సినిమా వేటయ్యన్ తో రాబోతున్నారు. ఈ సినిమాను టీ జీ జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ సాంగ్ ఇలా వచ్చిందో లేదో అలా వైరల్ అయ్యింది. అనిరుద్ క్యాచీ ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తున్నాయి.
వేటయ్యన్ సినిమాలో రజినికి జోడీగా మంజు వారియర్ (Manju Warrier) నటిస్తున్నారు. ఐతే ఈ సాంగ్ (Vetayyan Song) లో ఆమె స్టెప్పులు కూడా ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. నిన్న సాంగ్ రిలీజైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వేటయ్యన్ సాంగ్ వైరల్ గా మారింది. ఈ సాంగ్ తో సినిమాకు రావాల్సినంత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.
జైలర్ తర్వాత రజిని..
వేటయ్యన్ సినిమా విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎన్నో అంచనాలతో ఉన్నారు. జైలర్ తర్వాత రజిని చేస్తున్న సినిమాగా దీనిపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. జై భీం లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన జ్ఞానవేల్ రజినీ (Rajinikanth)తో ఎలాంటి సినిమా చేస్తారన్నది చూడాలి
రజినీ వేటయ్యన్ సినిమాలో రానా, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా సాంగ్ తో బజ్ పెంచగా ఇదే ఊపుతో సినిమా కూడా సూపర్ హిట్ కొడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. రజిని వేటయ్యన్ వస్తున్నాడని ఆయన సినిమాకు పోటీ అవ్వకూడదని సూర్య తను చేస్తున్న కంగువ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : NTR : దేవర స్టైల్ అదిరిందిగా..!