NTR : దేవర స్టైల్ అదిరిందిగా..!
- By Ramesh Published Date - 08:05 AM, Wed - 11 September 24

NTR ఎన్టీఆర్ దేవర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన లుక్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. దేవర సినిమా ట్రైలర్ (Devara Trailer) రిలీజ్ ను ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ (NTR) ధరించిన బ్లాక్ బ్లేజర్ లోపల నెక్ టీషర్ట్ ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చాయి.
బ్లేజర్ సెన్స్ అనే బ్రాండ్ ది కాగా లోపల వేసుకున్న బ్లాక్ నెక్ టీ షర్ట్ అమిరి బ్రాండ్ ది.. బ్లేజర్ ఒక 45 వేలు.. టీ షర్ట్ ఒక 450 వేల దాకా ధర ఉంటుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ వేసుకున్న షూస్ బ్యాలెన్సీ అనే బ్రాండ్ కి సంబంధిచినవని తెలుస్తుంది. వీటి ధర దాదాపు 1 లక్ష దాకా ఉంటుందట.
ఎన్టీఆర్ పెట్టుకునే వాచ్ ధర కోటి..
టాలీవుడ్ హీరోల్లో యాక్సెసరీస్ విషయంలో తారక్ ఎప్పుడు సంథింగ్ స్పెషల్ గా ఉంటాడు. అందుకే తను ధరించే ప్రతిదీ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటాడు. ఎన్టీఆర్ పెట్టుకునే వాచ్ ధర కోటి రూపాయల దాకా ఉంటుందని తెలిసిందే. ఓడమార్ పీగే బ్రాండ్ కి సంబందించిన ఈ వాచ్ కోటి రూపాయల దాకా ఉంటుందని తెలుస్తుంది.
దేవర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తారక్ సినిమాపై చాలా నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. చివరి 40 నిమిషాలు మాత్రం మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని అన్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు.
Also Read : Jagan Famous Dialogue in Devara : దేవర లో ‘జగన్’ డైలాగ్.. గమనించారా..?