Anirudh Ravichandran : దేవర సాంగ్.. అనిరుద్ ఇది ఊహించలేదుగా..!
Anirudh Ravichandran యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా దేవర.
- By Ramesh Published Date - 10:53 PM, Mon - 20 May 24

Anirudh Ravichandran యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న దేవర ఫస్ట్ సాంగ్ దేవర ముంగిట నువ్వెంత రిలీజ్ ముందే రజినికాంత్ హుకుం సాంగ్ ని దాటుతుందని అంచనాలు పెంచారు. తీరా సాంగ్ రిలీజ్ అయ్యే సరికి హుకుం సాంగ్ మించి కాదు కదా సాంగ్ ని రీచ్ కాలేదు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ సాంగ్ కన్నా ఆ విజువల్స్ లో తారక్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే దేవర ఫస్ట్ సాంగ్.. దేవర ముగింట నువ్వెంతలో ఎన్.టి.ఆర్ కన్నా అనిరుద్ ఎక్కువ కనిపించడం.. క్లారిటీగా కనిపించడం జరిగింది. ఎన్.టి.ఆర్ విజువల్స్ బాగున్నా అనిరుద్ మధ్యలో రావడం ఇబ్బందికరంగా అనిపించింది. ఒక దశలో ఎన్.టి.ఆర్ కన్నా అనిరుద్ ఎక్కువ కనిపించాడన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తను మ్యూజిక్ అందించే ప్రతి సాంగ్ లో ఇలా కనిపించడం అనిరుద్ కి అలవాటే కానీ ఎన్.టి.ఆర్ దేవర సాంగ్ లో అనిరుద్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఫ్యాన్స్. మరి సినిమాలో ఈ సాంగ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది చూడాలి.
Also Read : Vanga Geetha : చిరు అభిమానినే.. వంగ గీత మాటల వెనుక రహస్యం ఏంటో..?