Venkatesh – Rana : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం.. బాబాయ్ – అబ్బాయి భారీ విరాళం..
రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు హీరో వెంకటేష్, రానా కలిసి విరాళం ప్రకటించారు.
- By News Desk Published Date - 04:57 PM, Fri - 6 September 24

Venkatesh – Rana : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదాలతో అనేకమంది ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ప్రభుత్వం ఓ పక్క సహాయక చర్యలు చేపడుతుండగా మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రెండు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు భారీగా విరాళాలు ఇస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, బాలయ్య.. ఇలా చాలా మంది స్టార్స్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు ప్రకటించగా తాజాగా దగ్గుబాటి బాబాయ్ అబ్బాయిలు విరాళం ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు హీరో వెంకటేష్, రానా కలిసి విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50లక్షలు మొత్తం కోటి రూపాయలు ఇస్తున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో.. వరదల వాళ్ళ ఏర్పడిన నష్టాలు చూసి మేము చాలా బాధపడ్డాము. ఒక కోటి రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు అందిస్తాము. అవసరం అయిన వారికి ఇవి చేరువ కావాలని, వారంతా త్వరగా తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.
Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger. pic.twitter.com/h4YBFQbyWR
— Suresh Productions (@SureshProdns) September 6, 2024
Also Read : Pawan Kalyan: అనన్య నాగళ్లకు ధన్యవాదాలు: డిప్యూటీ సీఎం పవన్