Rajamouli Mahesh : ఆ టైటిల్స్ లో ఏది నిజం కాదా.. రాజమౌళి మహేష్ సినిమా మ్యాటర్ ఏంటి..?
Rajamouli Mahesh మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ సినిమాకు టైటిల్స్ గా మహారాజ, చక్రవర్తి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ సినిమాను
- By Ramesh Published Date - 08:52 AM, Mon - 19 February 24

Rajamouli Mahesh మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ సినిమాకు టైటిల్స్ గా మహారాజ, చక్రవర్తి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ సినిమాను రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెరకెక్కించనున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లె ముందే ఆరు నెలల వర్క్ షాప్ ప్లాన్ చేశారట. సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీని సెలెక్ట్ చేసినట్టు టాక్.
ఇదిలాఉంటే ఈ సినిమా టైటిల్స్ గా చెప్పుకుంటున్న మహారాజా, చర్క్రవర్తి ఈ రెండిటిలో ఏది నిజం కాదని తెలుస్తుంది. ఈ టైటిల్స్ కేవలం ఇండియా వరకు ఓకే కానీ పాన్ వరల్డ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు ఈ టైటిల్స్ పనికిరావు. వరల్డ్ వైడ్ గా సూట్ అయ్యేలా మంచి టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.
మొత్తానికి రాజమౌళి మహేష్ ఈ ఇద్దరు కలిసి తెలుగు సినిమాను మరో భారీ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. జక్కన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని తెలుస్తుంది. కచ్చితంగా రాజమౌళి ఈ సినిమా ప్లానింగ్ తో మరో రేంజ్ కి వెళ్తాడని చెప్పొచ్చు.