Nani : స్టార్ అయ్యాక నాని మారిపోయాడు.. ఆ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
Nani
- By Ramesh Published Date - 02:12 PM, Sun - 17 March 24

Nani తెలంగాణా చరిత్ర నేపథ్యంతో రజకా సినిమా చేసిన దర్శకుడు యాటా సత్యనారాయణ గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతుంది. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఇప్పటి దర్శకుడు కాదు ఆయన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దగ్గర పనిచేశారు. రాఘవేంద్ర రావు దగ్గర కో డైరెక్టర్ గా చేసిన యాత సత్యనారాయణ ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ని డైరెక్ట్ చేశారు.
మనోయజ్ఞం, త్రిశూలం, స్వర్ణఖడ్గం లాంటి సీరియల్స్ ను డైరెక్ట్ చేసిన సత్యనారాయణ నితిన్ హీరోగా చేసిన అల్లరి బుల్లోడు సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఇప్పటి హీరో నాని ఆ సినిమాకు పనిచేశారు. ఆ టైం లో సత్యనారాయణకు అసిస్టెంట్ గా పనిచేశాడు నాని.
ఆ తర్వాత నాని హీరో అయ్యాక సత్యనారాయణతో మాట్లాడటం మానేశాడట. నాని అష్టాచెమ్మాతో హీరోగా లాంచ్ అయినప్పుడు కూడా ఆయనకు మాట కూడా చెప్పలేదట. పేర్పర్ లో చూసి ఫోన్ చేస్తే నాని మాట్లాడాడట. అయితే స్టార్ అయ్యాక నాని మాట్లాడటం కూడా మానేశారని చెప్పారు యాటా సత్యనారాయణ.
బాపు గారి కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని నాని తన గాడ్ ఫాదర్ లా చూసే వాడు. ఆయనకు కూడా సినిమా ఛాన్స్ ఇవ్వలేదు నాని. స్టార్ అయ్యాక నాని మారిపోయాడని అంటున్నారు. మరి యాటా సత్యనారాయణ కామెంట్స్ కి నాని ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : Kalki vs Pushpa 2 : కల్కి వాయిదా పడుతుందా..? పుష్ప రాజ్ తో పోటీ సిద్ధమా..?