Nitin Rabinhood : రాబిన్ హుడ్.. నితిన్ షాకింగ్ లుక్ రివీల్ చేసిన హీరోయిన్..!
రాబిన్ హుడ్ (Rabinhood) తో ఈ కాంబో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాబిన్ హుడ్ సినిమా నుంచి నితిన్ షాకింగ్ లుక్ రివీల్ చేసింది హీరోయిన్ శ్రీలీల
- By Ramesh Published Date - 06:08 PM, Thu - 11 July 24

లవర్ బోయ్ నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ అంటూ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. రాబిన్ హుడ్ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండగా భీష్మ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రాబిన్ హుడ్ సినిమా లో నితిన్ ఒక దొంగగా కనిపించనున్నాడు. సినిమా స్టోరీ ఏంటన్నది పెద్దగా రివీల్ చేయలేదు కానీ సినిమా మాత్రం నితిన్ ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చేలా ఉంది.
ఛలో, భీష్మ సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల రెండోసారి నితిన్ (Nitin) తో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ నితిన్ తో శ్రీ లీల ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమా చేసింది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకుంది.
అయితే రాబిన్ హుడ్ (Rabinhood) తో ఈ కాంబో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాబిన్ హుడ్ సినిమా నుంచి నితిన్ షాకింగ్ లుక్ రివీల్ చేసింది హీరోయిన్ శ్రీలీల. అమ్మడు షేర్ చేసిన వీడియోలో నితిన్ ఓల్డ్ లుక్ తో షాక్ ఇచ్చాడు. అంటే సినిమాలో నితిన్ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. నితిన్ వెంకీ కుడుముల ఈ కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ అనిపించుకోగా రాబిన్ హుడ్ తో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు.
ఈ సినిమాతో పాటు నితిన్ వేణు శ్రీరాం (Venu Sriram) డైరెక్షన్ లో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ (Laya) కూడా నటిస్తుంది. నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ టార్గెట్ తో వస్తుంది. మరి ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. నితిన్ మాత్రం రాబోతున్న రెండు సినిమాలతో కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే అన్నంత కసితో ఉన్నాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాల అవుట్ పుట్ కూడా చాలా సంతృప్తికరంగా ఉందని టాక్.
Also Read : Bharateeyudu 2 Business : కమల్ భారతీయుడు 2 బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా..?