Bharateeyudu 2 Business : కమల్ భారతీయుడు 2 బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా..?
కమల్ హాసన్ భారతీయుడు 2 (Bharateeyudu 2) సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
- By Ramesh Published Date - 05:45 PM, Thu - 11 July 24

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను శంకర్ చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కించారు. సినిమా మొదలైన నాటి నుంచి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఒకానొక దశలో ఇండియన్2 ని ఆపేద్దామని కూడా అనుకున్నారు. ఐతే కమల్ హాసన్ విక్రం (Vikram) హిట్ అవ్వడంతో ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలని అనుకున్నారు.
శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ ఇండియన్ 2 (Indian 2) వస్తుంది. ఈ సినిమాలో కమల్ మాత్రమే కాకుండా సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించారు. సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. పోటీగా మరే సినిమా లేకపోవడం భారతీయుడు 2 కి కలిసి వచ్చే అంశమని చెప్పొచ్చు.
కమల్ హాసన్ భారతీయుడు 2 (Bharateeyudu 2) సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నైజాం లో 9 కోట్లు.. ఆంధ్రా లో 11 కోట్లు.. సీడెడ్ లో 4 కోట్లుగా మొత్త ఏపీ తెలంగాణా కలిపి 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇండియన్ 2.
ఇక ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే మాత్రం 25 కోట్ల పైన రాబట్టాల్సి ఉంటుంది. నైజాంలో ఈ సినిమాపై ఉన్న బజ్ చూసి సినిమా టికెట్ రేట్లను పెంచారు. మరి కమల్ ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. రీసెంట్ గా కమల్ హాసన్ ప్రభాస్ కల్కి సినిమాలో నటించారు. ఆ సినిమాలో యాస్కిన్ పాత్రలో అదరగొట్టారు కమల్. ఆ సినిమా ఎఫెక్ట్ కూడా ఇండియన్ 2 మీద ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇండియన్ 2 ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది.
Also Read : Srinidhi Shetty : KGF బ్యూటీతో నాని జోడి..!