Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..
ఆదివారం రోజు తమిళం, కన్నడ వర్షన్‌ల నుంచి అంతంత మాత్రమే కలెక్షన్స్(Pushpa 2 Collections) వచ్చాయి.
- By Pasha Published Date - 10:16 AM, Mon - 30 December 24

Pushpa 2 Collections : అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా దుమ్మురేపుతోంది. బాక్స్ ఆఫీస్‌లో కలెక్షన్ల పంట పండిస్తోంది. డిసెంబరు 29వ తేదీ (ఆదివారం)తో ఈ సినిమా విడుదలై 25 రోజులు గడిచాయి. ఈ 25 రోజుల వ్యవధిలో మన దేశంలో రూ.1,157.35 కోట్లను ఈ సినిమా వసూలు చేసింది. దేశంలోని చాలా భాషల్లో ‘పుష్ప 2 ది రూల్’ రిలీజ్ అయింది. హిందీ వర్షన్‌లో ఆదివారం రోజు (డిసెంబరు 29న) అత్యధికంగా రూ.12.75 కోట్లు వసూలయ్యాయి. తెలుగు వర్షన్‌లో రూ.2.75 కోట్లు వచ్చాయి. ఆదివారం రోజు తమిళం, కన్నడ వర్షన్‌ల నుంచి అంతంత మాత్రమే కలెక్షన్స్(Pushpa 2 Collections) వచ్చాయి.
Also Read :Prashant Kishor : ప్రశాంత్ కిశోర్‌పై కేసు.. బీపీఎస్‌సీ అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగం
డిసెంబరు 5న విడుదలైన ఈ సినిమాలో విభిన్నమైన కథ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా రూ.16 కోట్లను అల్లు అర్జున్ మూవీ వసూలు చేయగలిగింది. ఇక ఇంటర్నేషనల్ మూవీ మార్కెట్‌లోనూ పుష్ప ది రూల్ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా రూ.1,700 కోట్ల కలెక్షన్లను దాటేసింది. దీంతో ఇంతకుముందు అంతర్జాతీయంగా కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాలను పుష్ప2 అధిగమించింది. కలెక్షన్ల విషయంలో దంగల్, బాహుబులి : ది కంక్లూషన్ మూవీలు నెలకొల్పిన రికార్డులను అల్లు అర్జున్ సినిమా దాటేసింది.
Also Read :Jimmy Carter : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. ఆయన లైఫ్‌లోని కీలక ఘట్టాలివీ
రోజువారీ కలెక్షన్ల చిట్టా..
- ప్రీ లాంచ్ : రూ.10.65 కోట్లు
- Day 1: రూ.164.25 కోట్లు
- Day 2: రూ.93.80 కోట్లు
- Day 3: రూ.119.25 కోట్లు
- Day 4: రూ.141.05 కోట్లు
- Day 5: రూ.64.45 కోట్లు
- Day 6: రూ.51.55 కోట్లు
- Day 7: రూ.43.35 కోట్లు
- Day 8: రూ.37.45 కోట్లు
- Day 9: రూ.36.40 కోట్లు
- Day 10: రూ.63.30 కోట్లు
- Day 11: రూ.76.60 కోట్లు
- Day 12: రూ.26.95 కోట్లు
- Day 13: రూ.23.35 కోట్లు
- Day 14: రూ.20.55 కోట్లు
- Day 15: రూ.17.65 కోట్లు
- Day 16: రూ.14.30 కోట్లు
- Day 17: రూ.24.75 కోట్లు
- Day 18: రూ.32.95 కోట్లు
- Day 19: రూ.12.25 కోట్లు
- Day 20: రూ.14.25 కోట్లు
- Day 21: రూ.19.50 కోట్లు
- Day 22 (గురువారం): రూ.10.50 కోట్లు
- Day 23 (శుక్రవారం): రూ.8.75 కోట్లు
- Day 24 (శనివారం): రూ.12.50 కోట్లు
- Day 25 (ఆదివారం): రూ.16 కోట్లు