HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Former Us President Jimmy Carter Passes Away At 100

Jimmy Carter : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. ఆయన లైఫ్‌లోని కీలక ఘట్టాలివీ

జిమ్మీ మృతి పట్ల కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Jimmy Carter) సంతాపం తెలిపారు.

  • By Pasha Published Date - 08:36 AM, Mon - 30 December 24
  • daily-hunt
Jimmy Carter Former Us President Us

Jimmy Carter : జిమ్మీ కార్టర్‌ ఇక లేరు. ఒకప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఆరోగ్య సమస్యలతో 100 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఆయన కన్నుమూశారు.  ఈవిషయాన్ని జిమ్మీ కార్టర్ కుమారుడు జేమ్స్‌ ఇ.కార్టర్‌ 3 వెల్లడించారు. ఆయన మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో అమెరికా అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ తనదైన ముద్ర వేశారని బైడెన్‌ కొనియాడారు. జిమ్మీ మృతి పట్ల కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Jimmy Carter) సంతాపం తెలిపారు. కార్టర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైట్‌హౌస్‌ తెలిపింది.

Also Read :Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎంతో దిల్ రాజు మీటింగ్..!

కార్టర్ గురించి..

  • జిమ్మీ కార్టర్  1924 అక్టోబరు 1న జన్మించారు.
  • కార్టర్ ఈ సంవత్సరమే తన 100వ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు.
  • ఆయన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జన్మించారు.
  • జిమ్మీ కార్టర్ 1946 జూన్‌లో అమెరికా నావల్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేశారు.
  • 1946 జులైలో ఆయన రోసాలిన్ స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు.
  • 1946 నుంచి 1953 మధ్యకాలంలో అమెరికా నేవీ న్యూక్లియర్ సబ్ మెరైన్ ప్రోగ్రాంలో జిమ్మీ కార్టర్ పనిచేశారు. అక్కడ ఆయనకు లెఫ్టినెంట్ కమాండర్ హోదా లభించింది.
  • 1953లో అమెరికా నేవీలోని తన పదవికి కార్టర్ రాజీనామా చేశారు.
  • 1953 నుంచి 1971  మధ్యకాలంలో కార్టర్ వ్యవసాయం చేశారు. గిడ్డంగుల బిజినెస్ నడిపారు.
  •  1963 నుంచి 1966 మధ్యకాలంలో జార్జియా రాష్ట్ర సెనేట్‌కు కార్టర్ ఎన్నికయ్యారు.
  • 1966లో జార్జియా గవర్నర్ ఎన్నికల నామినేషన్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.
  • 1970లో జార్జియా గవర్నర్‌గా కార్టర్ ఎన్నికయ్యారు. 1971 నుంచి 1975 మధ్యకాలంలో ఆయన గవర్నర్‌గా సేవలు అందించారు.
  • 1974 డిసెంబరు 12న అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని కార్టర్ ప్రకటించారు.
  • అయితే కార్టర్ 1977లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
  • 1977-1981 మధ్య కాలంలో అమెరికాకు 39వ అధ్యక్షుడిగా కార్టర్ సేవలు అందించారు.
  • అమెరికాలో రైతుగా, నేవీ ఉద్యోగిగా, రాష్ట్ర గవర్నర్‌గా, దేశ అధ్యక్షుడిగా వివిధ రకాల బాధ్యతలను కార్టర్ నిర్వర్తించారు.
  • మానవతావాద స్థాపన కోసం కార్టర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకే 2002 సంవత్సరంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు.
  • క్యాన్సర్ వ్యాధిని జయించి 100 ఏళ్ల పాటు జీవించిన రికార్డు కార్టర్  సొంతం.
  • అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి వందేళ్లు బతికిన తొలి వ్యక్తి కార్టర్ మాత్రమే.
  • 1978లో భారత్‌ పర్యటనకు జిమ్మీ కార్టర్‌ వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఒక గ్రామానికి కార్టర్‌పురి అని పేరు పెట్టారు.

Also Read :Pushpa 3 : పుష్ప 3 లో అతను ఉండే ఛాన్స్ లేదా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Former US President
  • Jimmy Carter
  • us

Related News

Trump Is Dead

Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd