Businessman Remake:హిందీలో ‘బిజినెస్ మేన్’ రీమేక్ ఉంటుంది: పూరి
హీరోగా మహేశ్ బాబు .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ చాలానే సినిమాలు చేశారు. ఇద్దరి కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'పోకిరి' ..
- By Hashtag U Published Date - 12:47 PM, Wed - 24 August 22

హీరోగా మహేశ్ బాబు .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ చాలానే సినిమాలు చేశారు. ఇద్దరి కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ‘పోకిరి’ .. ‘బిజినెస్ మేన్’ కనిపిస్తాయి. సంచలన విజయాలను సాధించిన ఈ రెండు సినిమాలకి సీక్వెల్స్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ రెండు కథలకు సీక్వెల్ లాగే దమ్ముందనీ .. ఆ రెండు సినిమాల్లోని హీరో పాత్రలంటే తనకి చాలా ఇష్టమని ‘లైగర్’ ప్రమోషన్స్ లో పూరి అన్నాడు.
అప్పట్లోనే తానూ సీక్వెల్స్ ప్లాన్ చేసినా మహేశ్ బిజీగా ఉండటం వలన వీలుపడలేదని చెప్పాడు. అన్నీ కలిసొస్తే తెలుగులో ఈ సీక్వెల్స్ ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ‘బిజినెస్ మేన్’ సినిమాను మాత్రం హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందనీ, అందుకు సంబంధించిన సన్నాహాలను త్వరలోనే మొదలుపెడతామని చెప్పాడు. మరి కరణ్ జొహార్ తో కలిసి పూరి ఏ బాలీవుడ్ హీరోను సెట్ చేస్తాడో చూడాలి. ఆయన తాజా చిత్రమైన ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.