Prudhvi Raj : ఎన్టీఆర్ ని అలా పిలిస్తే నచ్చదంటున్న పృథ్వి..!
థర్టీ ఇయర్ పృధ్వి (Prudhvi Raj) కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు అటు పొలిటికల్ విషయాలను కూడా
- Author : Ramesh
Date : 24-09-2023 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
థర్టీ ఇయర్ పృధ్వి (Prudhvi Raj) కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు అటు పొలిటికల్ విషయాలను కూడా ప్రస్తావిస్తూ వార్తల్లో ఉంటుంటాడు. ఒకప్పుడు వైసీపీ సపోర్టర్ గా ఉన్న పృధ్వి అక్కడ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం జనసేన కు సపోర్ట్ గా ఉంటున్న ఆయన మైక్ అందుకున్నాడు అంటే అన్ని విషయాల మీద తన ఒపీనియన్ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ గురించి ఆయన చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చంద్రబాబు అరెస్ట్ మీద ఎన్టీఆర్ ని స్పందించాలని అందరు అడుగుతున్నారు. అతను సమయం వచ్చినప్పుడు స్పందిస్తాడని. అతను ఎప్పుడు స్పందించాలి అన్నది అతనికి ఒక లెక్క ఉంటుందని అన్నారు. ప్రతిదానికీ ఎన్టీఆర్ ను ఈ విషయాల్లోకి లాగడం కరెక్ట్ కాదని అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ ని పిలవడం కూడా తనకు నచ్చదని ఆయన్ను నందమూరి తారక రామారావు అంటే బాగుంటుందని అన్నారు పృధ్వి.
సినిమాల్లో ఈమధ్య వేషాలు తగ్గాయనుకుంటున్న టైం లో బ్రో సినిమాలో వేసిన శ్యాం బాబు రోల్ బాగా పేలింది. ఇప్పుడు మళ్లీ పృధ్వి (Prudhvi Raj) తిరిగి సినిమాల మీద పూర్తి ఫోకస్ చేయాలని చూస్తున్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా చేసేందుకు రెడీ అంటున్న పృధ్వి కొన్నాళ్లు కమెడియన్ గా మెప్పించారు. అయితే మధ్యలో కొన్ని వివాదాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
పృధ్వి ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ పై తారక్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పృధ్వి రాజ్ మాత్రం ఎన్టీఆర్ ని జూనియర్ అని పిలవడం తనకు ఇష్టం లేదన్నట్టుగానే చెప్పుకొచ్చాడు. మరి ఈ కామెంట్స్ పై మిగతా వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Charlie In Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లోకి చార్లీ