Pawan Kalyan : పవన్ కోసం ఏపీకి తరలిన నిర్మాతలు.. ఇకపై షూటింగ్స్ కూడా అక్కడే..
రేపు జూన్ 14 నుండి వారాహి యాత్ర మొదలుపెట్టారు. మరో వైపు ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ అయిపోవాలని ఫిక్స్ అయ్యారు . దీంతో పవన్, ఆయన నిర్మాతలు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
- By News Desk Published Date - 09:34 PM, Tue - 13 June 23

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రెండు పడవలపై కాళ్ళు వేసి వెళ్తున్నారు. ఓ వైపు సినిమా షూటింగ్స్(Movie Shootings) చేస్తూనే మరో పక్క త్వరలో ఎలక్షన్స్(Elections) వస్తుండటంతో రాజకీయాల్లో(Politics) బిజీ అవుతున్నారు. రేపు జూన్ 14 నుండి వారాహి యాత్ర మొదలుపెట్టారు. మరో వైపు ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ అయిపోవాలని ఫిక్స్ అయ్యారు . దీంతో పవన్, ఆయన నిర్మాతలు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
నిన్న సోమవారం పవన్ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చండీయాగం నిర్వహించారు. జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ యాగానికి పవన్ తో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న నిర్మాతలు AM రత్నం, వివేక్, DVV దానయ్య, రవిశంకర్ లతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా విచ్చేశారు. యాగం అనంతరం జనసేన ఆఫీస్ ని సందర్శించి మీడియాతో మాట్లాడారు.
నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ గారు రాజకీయాలతో ప్రస్తుతం బిజీ అవుతున్నారు. వారాహి యాత్రకు అభినందనలు తెలుపుతున్నాము. ఇకపై పవన్ కళ్యాణ్ గారి సినిమాల షూటింగ్స్ చాలా వరకు ఏపీలోనే ఉంటాయి. ఏపీలో కూడా రెగ్యులర్ గా పలు ప్రదేశాల్లో షూటింగ్స్ నిర్వహిస్తూనే ఉన్నాము. ఇప్పుడు విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో కూడా లొకేషన్స్ చూస్తాము. సెట్స్ వేసి చేసే షూటింగ్స్ అయితే ఇక్కడే ఏపీలో సెట్స్ వేసి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో షూటింగ్స్ ఉండాలని భావిస్తున్నాం అని తెలిపారు. దీంతో ఈ నిర్ణయం వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్స్ అన్నట్టు నిర్మాతలు తెలిపారు. దీంతో ఇకపై సెట్స్ అన్ని ఏపీలోనే వేసి షూటింగ్స్ చేయబోతున్నట్టు సమాచారం. పవన్ రాజకీయాలతో అక్కడ బిజీగా ఉండటం. షూటింగ్స్ హైదరాబాద్ లో ఉండటంతో అటు, ఇటు టైం, మనీ రెండూ వృధా అవుతున్నాయి. దీంతో పవన్ చెప్తేనే నిర్మాతలు, డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఏపీలో పవన్ యాత్రతో ఫుల్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కు ఇకపై షూటింగ్స్ కూడా ఏపీలోనే చేస్తారనడంతో మరింత ఖుషి అవుతున్నారు.