HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Producer Nagavamshi Interesting Comments About Tillu Squel Part 3

Navdeep: పెళ్లి పీటలెక్కబోతున్న హీరో నవదీప్.. శుభలేఖ ఫోటోస్ వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 31-03-2024 - 6:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Navdeep
Navdeep

టాలీవుడ్ హీరో నటుడు నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కొన్ని సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అలాగే తెలుగులో పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే నవదీప్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆ తర్వాత లిస్ట్‏లో ఉన్న హీరోలలో నవదీప్ ఒకరు.

జై సినిమాతో హీరోగా పరిచయమై ఇప్పుడు సహయ నటుడిగా మెప్పిస్తున్నారు. ఇటీవలే రవితేజ నటించిన ఈగల్ చిత్రంలోనూ కనిపించారు నవదీప్. అటు సినిమాల్లో నటిస్తూనే..ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు నవదీప్. నెట్టింట ట్రెండ్ అవుతున్న సాంగ్స్, డైలాగ్స్ ‏కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటాడు. ఇక ఈ హీరోకు ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయని అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల తన ఇన్ స్టాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ అందరు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు. ప్రతిరోజూ ఇంటికి వెళ్లినా, ఇన్ కు వెళ్లినా ఒకటే ప్రశ్న. అదెప్పుడూ అని చెప్తా.. చెప్తా రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయ్యి ఉండొచ్చు.

 

 

View this post on Instagram

 

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

లవ్ మౌళి రిలీజ్ డేట్ అయ్యి ఉండవచ్చు. ఎలక్షన్స్ లో నేను నిలబడబోతున్న నామినేషన్స్ డేట్ అయ్యి ఉండవచ్చు. అదేంటో రేపు చెప్తాని అప్పటివరకు మీరు గెస్ చేయండి అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి శుభలేఖ షేర్ చేసి షాకిచ్చాడు. అంతకు ముందు రోజే అందరు అడుగు అంతేకాదు.. ముహుర్తం ఎప్పుడు? పెళ్లి కూతురు ఎవరు ? అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి శుభలేఖ గురించి ప్రత్యేకంగా ఒక వీడియోను సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశాడు.అయితే నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి శుభలేఖ కనిపించడం నిజమే. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శుభలేఖలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వివరాలు కాకుండా, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లవ్ మౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. నవదీప్, పంఖురి గిద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌళి. ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ఆ శుభలేఖలో తెలియజేశాడు. పెళ్లి కొడుకు పేరు దగ్గర నవీదీప్ పేరు, పెళ్లి కూతురు పేరు స్థానంలో పంఖురి గిద్వానీ పేరు, ముహుర్తం ప్లేస్ లో సినిమా రిలీజ్ డేట్ ను చూపిస్తూ, పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అచ్చం అలాగే డిజైన్ చేసి లవ్ మౌళి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు నవదీప్. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అంటే ఇక నీకు లైఫ్లో పెళ్లి కాదు ఇలాగే వీడియోలు పెడుతూ ఉండు లైఫ్ లో పెళ్లి అవ్వదు అంటూ నెగిటివ్ గా స్పందిస్తున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • marriage
  • Navdeep
  • tollywood
  • video viral

Related News

Fans clarify Junior NTR's political entry.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్

  • Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

    Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd