NTR : ఎన్టీఆర్ తో నీల్.. పక్కన ఆయన కూడా..?
NTR ఈ సినిమాకు సంబందించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నే ఈ ప్రాజెక్ట్ కి ఫిక్స్ చేశారు. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక ఫోటో దిగారు.
- By Ramesh Published Date - 11:37 PM, Wed - 1 January 25

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఆ సినిమాలో తన పాత్రతో బీ టౌన్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాపై ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఈ సినిమాకు సంబందించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నే ఈ ప్రాజెక్ట్ కి ఫిక్స్ చేశారు. దాన్ని కన్ ఫర్మ్ చేస్తూ ఒక ఫోటో దిగారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లేటెస్ట్ గా తారక్ ని కలిసి వారు మాట్లాడినట్టు ఉంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కు డ్రాగన్ అనే టైటిల్ పెట్టాలని ఆలోచించారు. కానీ కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ ఆ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాకు రవి మ్యూజిక్ అంటే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఈ సినిమా ప్రశాంత్ నీల్ ఎలా తీస్తాడో చూడాలి. సలార్ 1 తర్వాత తారక్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.