Salaar Delay: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సలార్ మూవీ విడుదల వాయిదా..!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సలార్' (Salaar Delay). 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
- By Gopichand Published Date - 09:48 AM, Wed - 13 September 23

Salaar Delay: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘సలార్’ (Salaar Delay). ‘కెజియఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. సలార్ సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. సెప్టెంబర్ 28న సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ సలార్ సినిమా మళ్ళీ వాయిదా పడింది. మూవీ వాయిదా గురించి చిత్ర యూనిట్ అధికారికంగా సమాచారం ఇచ్చింది.
We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances.
Please understand this decision is made with care, as we're committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/LPf5N2roh7— Salaar (@SalaarTheSaga) September 13, 2023
బుధవారం ఉదయం సలార్ సినిమా వాయిదాపై చిత్రయూనిట్ స్పందించింది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సలార్ వాయిదాపై ఓ పోస్ట్ చేసింది. సలార్ మూవీ కోసం మీ తిరుగులేని మద్దతును మేము ఎంతో అభినందిస్తున్నాము. అనుకోని పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 28న మూవీ విడుదల చేయలేకపోతున్నాం. సలార్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి థాంక్స్. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్రయూనిట్ కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాము అని ప్రకటించారు.
Also Read: iPhone 15 Launched : అదిరిపోయే ఫీచర్స్ తో ‘ఐఫోన్ 15’ ఫోన్లు వచ్చేశాయ్
సలార్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం విడుదల పోస్ట్ ఫోన్ అని చెప్పారు. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కెజిఎఫ్ నిర్మాతలైన హోంబలే పిక్చర్స్ నిర్మిస్తున్నారు.