iPhone 15 Launched : అదిరిపోయే ఫీచర్స్ తో ‘ఐఫోన్ 15’ ఫోన్లు వచ్చేశాయ్
iPhone 15 Launched : స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 15 సిరీస్’ను విడుదల చేసింది.
- By Pasha Published Date - 09:35 AM, Wed - 13 September 23
iPhone 15 Launched : స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 15 సిరీస్’ను విడుదల చేసింది. వీటిలో ఒక మోడల్ ను iPhone 15, మరొక మోడల్ ను iPhone 15 Plus అంటారు. iPhone 15 మోడల్ సైజు 6.1 అంగుళాలు, iPhone 15 Plus మోడల్ సైజు 6.7 అంగుళాలు. ఈ ఫోన్ల వెనుక ప్యానెల్ డిజైన్ మాత్రం చూడటానికి ఐఫోన్ 13, ఐఫోన్ 14లాగే కనిపిస్తోంది. డిస్ప్లే చాలా బెటర్ గా, ఎక్కువ బ్రైట్ నెస్ తో నిండి ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే.. 48MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ కెమెరా సెన్సార్ షిఫ్ట్ ఫీచర్, 2X ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుండటం విశేషం. ట్రూ-డెప్త్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అమెరికాలో జరుగుతున్న Apple యొక్క ‘Wonderlust’ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో హై పెర్ఫార్మెన్స్ A16 బయోనిక్ ప్రాసెసర్ ను అమర్చారు. గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14 ప్రో ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ను వాడారు. మిగతా ఐఫోన్ల కంటే ఐఫోన్ 15 లో మెరుగైన బ్యాటరీ ఉంది. ఎమర్జెన్సీ SOS సర్వీస్ ఐఫోన్ 15 మోడల్స్ లో అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ ఉంటుంది. ఐఫోన్ 15 ధర 128GB వేరియంట్ రూ.79,900గా నిర్ణయించారు. ఐఫోన్ 15 ప్లస్ యొక్క 128GB వేరియంట్ ధర రూ.89,900గా డిసైడ్ చేశారు.
Also read : Google Pays 82000 Crores : గూగుల్ ఆ కంపెనీలకు ఏటా 82వేల కోట్లు ఇస్తోంది.. అమెరికా సర్కారు సంచలన ఆరోపణలు
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్..
ఇక ఇదే ఈవెంట్ లో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లను కూడా యాపిల్ రిలీజ్ (iPhone 15 Launched) చేసింది. వీటిలో A17 బయోనిక్ ప్రాసెసర్ ఉంది. iPhone 15 Pro యొక్క 128GB వేరియంట్ ధరను రూ.1,34,900గా నిర్ణయించారు. iPhone 15 Pro Max యొక్క 256GB వేరియంట్ ధరను రూ. 1,59,900గా డిసైడ్ చేశారు. ఈ ఫోన్ల ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుంచి సేల్స్ జరుగుతాయి. వీటితోపాటు Apple Watch Series 9ను కూడా విడుదల చేశారు. దీని ధర రూ. 30,064.
Related News
apple : కేంద్రం వార్నింగ్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ యూజర్లకు ‘హై రిస్క్’
apple: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్ ఇన్) తాజాగా భారత్(India) లోని యాపిల్ ఉత్పత్తుల(Apple products) యూజర్లకు(users) భారీ సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ డివైస్‌లలో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబులిటీ’ని గుర్తించామని.. ఇది యూజర్ల డివైస్‌లు హ్యాకర్ల బారిన పడేందుకు దారితీయొచ్చని హెచ్చరించింది. దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొర�