Prabhas Kalki Promotions : కల్కి పేరు దేశం మొత్తం మారుమోగేలా.. నాగ్ అశ్విన్ ప్రమోషనల్ ప్లాన్ అదుర్స్..!
Prabhas Kalki Promotions ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా మరో 13 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్
- Author : Ramesh
Date : 14-06-2024 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas Kalki Promotions ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా మరో 13 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచగా సినిమాతో నెవర్ బిఫోర్ రికార్డులను కొల్లగొట్టేలా ఉన్నారు కల్కి టీం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. కల్కి పేరు దేశం మొత్తం మారు మోగేలా కల్కి కోసం ప్రత్యేకంగా కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేశారు. కల్కి పోస్టర్, వీడియోలతో కూడా ఎల్.ఈ.డి స్క్రీన్స్ ఉన్న వెహికల్స్ ని దేశం మొత్తం తిప్పేలా ప్లాన్ చేశారు.
కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ చేస్తున్న ఈ ప్రమోషన్స్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కల్కి ట్రైలర్ తో దుమ్ము దులిపేయగా సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో సంచలనాలు సృష్టించేలా ఉంది. ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన కల్కి సినిమాలో దీపిక పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని కూడా నటించారు.
నాగ్ అశ్విన్ కల్కితో ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. తప్పకుండా జూన్ 27న సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా ఒక గొప్ప అనుభూతిని పొందేలా ఉన్నారు. మరి ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుందో సినిమా చూస్తేనే కానీ అర్ధమవుతుంది.
The ride to spread the light across the nation kicks off! #Kalki2898AD pic.twitter.com/FSBjk8hodx
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 13, 2024