Floods : తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం అందించి నిజమైన ‘రాజు’ అనిపించుకున్న ప్రభాస్
ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి నిజమైన రాజు అనిపించుకున్నారు. తనవంతు సాయంగా రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ఆయన టీమ్ వెల్లడించింది
- By Sudheer Published Date - 01:21 PM, Wed - 4 September 24
ఒకరికి సాయం చేయాలంటే పెద్ద మనసు ఉండాలి..ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరిలో స్వార్థం అనేది పెరిగిపోయింది. ఎవరైన ఆపదలో ఉంటె సాయం చేయడం అంటుంచింతే..చేసేవారిని కూడా చేయనివ్వడం లేదు. మనకెందుకు..? మనం ఎందుకు సాయం చేయాలి..? మనవాళ్ళు లేరు కదా..? ప్రభుత్వాలు ఉన్నాయి కదా..? మనం చేస్తేనే వారు బాగుపడతారా..? వారి ఆకలి తీరుతుందా..? ఇలా ఎన్నో అనుకుంటూ సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ ఇలాంటి ఈరోజుల్లో..ఈ మనుషుల మధ్య కూడా మీకు మేమున్నాం అంటూ చిత్రసీమ కదిలి వస్తుంది. కేవలం మీకు వినోదం అందించడమే కాదు మీరు ఆపదలో ఉంటే ఆదుకోవడం కోవడం కూడా మా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరు రెండు తెలుగు రాష్ట్రాలకు తమ వంతు ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , బాలకృష్ణ , సిద్దు , త్రివిక్రమ్ ఇలా ఎంతో మంది హీరోలు , హీరోయిన్స్ , డైరెక్టర్లు , నిర్మాతలు ఆర్ధిక సాయం ప్రకటించగా..తాజాగా ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి నిజమైన రాజు అనిపించుకున్నారు. తనవంతు సాయంగా రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ఆయన టీమ్ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల సీఎం రీలీఫ్ ఫండ్ కు చెరో రూ.కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. ప్రభాస్ కలియుగ కర్ణుడు, రాజులకే రాజని అభిమానులు కొనియాడుతున్నారు. విరాళాలివ్వడాన్ని ఎన్టీఆర్ స్టార్ట్ చేయగా అందరికంటే ఎక్కువ ఇప్పటి వరకు ప్రభాస్ అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటివరకు ఆర్ధిక సాయం ప్రకటించిన వారు..
చిరంజీవి కోటి, పవన్ కళ్యాణ్ రూ.కోటి , మహేశ్ బాబు రూ. కోటి , హీరోయిన్ అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షల సాయం , హీరో సందీప్ కిషన్ తన వంతుగా బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం అందజేశారు.
నందమూరి బాలకృష్ణ కోటి, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ఎస్. రాధాకృష్ణ, ఎస్ నాగవంశీలు సంయుక్తంగా తమ హారిక, హసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ తరుపున ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 లక్షలు, తెలంగాణలకు రూ.25 లక్షల చొప్పున మొత్తంగా రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షలు ప్రకటించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ప్రకటించారు.
Read Also : Vivo T3 pro 5G: మార్కెట్లోకి విడుదల అయిన వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే సూపర్ ఫీచర్స్!
Related News
TDP-JanaSena : టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు..!
Differences between TDP-Jana Sena: కృష్ణా జిల్లాలో అధికార కూటమి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది.