Tollywood Fans War : సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్.. కారణం ఇదేనా..?
టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఇద్దరి హీరోల అభిమానులు ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.
- By Vara Prasad Updated On - 10:21 AM, Tue - 19 July 22

టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఇద్దరి హీరోల అభిమానులు ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఇండియా టుడే మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ జూలై 2022 సంచికలో అల్లు అర్జున్ తన ‘సౌత్ స్వాగ్’ని కవర్‌పైకి తీసుకువరావడంతో అల్లు అర్జున్ ప్రత్యేక కవర్ ఫోటో వైరల్ అయ్యింది. దీంతో అల్లు అర్జున్ పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తన అభిమానులు. అయితే ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్‌తో వార్ డిక్లేర్ చేశారు.
తమ హీరో 2017లోనే ఇండియా టుడే కవర్ పేజీపై కనిపించాడని, అప్పుడే దక్షిణాది సినిమా గురించి యావత్ దేశం చర్చించుకునేలా చేశాడని వారు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బన్నీ ఫ్యాన్స్ కూడా పలు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కేవలం బాహుబలి సినిమా గురించే ప్రభాస్ ఫోటో వేశారని, కానీ తమ హీరో ఫోటోను ఆయన తన స్టైల్‌ను యావత్ ప్రపంచానికి రుచిచూపించడంతో ఇప్పుడు అది ట్రెండ్‌గా మారడంతో ఆయనకు ఇండియా టుడే ఈ విధంగా సత్కారం చేసిందంటూ బన్నీ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఇండియా టుడే కవర్ పేజీపై బన్నీ స్టైలిష్ ఫోటో కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది.
Related News

Samantha Part Of ‘Pushpa 2’: క్రేజీ ఆప్డేట్.. పుష్ప-2లో సమంత.. ఫుష్పరాజ్ ఫ్రెండ్ గా!
స్టార్ నటి సమంత 'పుష్ప 2'లోని 'ఊ అంటావా' సాంగ్‌లో గ్లామర్ ట్రీట్‌తో చాలా పాపులారిటీ సంపాదించింది.