Pooja Hegde : శారీలో బుట్ట బొమ్మ.. బాపు బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా..!
బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) ఈమధ్య సినిమాల్లొ ఎక్కువగా కనిపించకపోయినా ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది. తన థై షోతో ఫాలోవర్స్ ని నిద్ర పట్టకుండా చేసే అమ్మడు
- Author : Ramesh
Date : 19-02-2024 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) ఈమధ్య సినిమాల్లొ ఎక్కువగా కనిపించకపోయినా ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది. తన థై షోతో ఫాలోవర్స్ ని నిద్ర పట్టకుండా చేసే అమ్మడు ఈమధ్య నిండుగా బట్టలు వేసుకుని అలరిస్తుంది. లేటెస్ట్ గా శారీ లుక్ లో అందాల పూజా అదరగొట్టేసింది. హాట్ అండ్ క్రేజీ లుక్స్ తో అలరించే భామలు పద్ధతిగా శారీ కడితే ఆ లెక్క వేరుగా ఉంటుంది.

ప్రస్తుతం పూజా హెగ్దే అలాంటి శారీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. అందమైన శారీ ఒంటి నిండా నగలు.. తల్లో మల్లెపూలతో పూజా బేబీ లుక్స్ అమేజింగ్ అనిపిస్తుంది. శారీ లో పూజా హెగ్దే ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక క్రేజ్ వచ్చాక హీరోయిన్స్ ఏం చేసినా సరే అది వైరల్ గా మారుతుంది అంటే ఇదే కావొచ్చు.

పూజా హెగ్దే లేటెస్ట్ శారీ లుక్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేస్తుంది. పూజా శారీ ఫోటో షూట్స్ చేస్తున్న అమ్మడిని చూసి బాపు గీసిన బొమ్మకు ప్రాణం పోసినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

పూజా హెగ్దే శారీ లుక్ ఫోటో షూట్స్ ఆమె గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చేశాయి. తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేని పూజా మన దర్శక నిర్మాతలకు అసలు ఆనట్లేదని చెప్పొచ్చు.