Pawan Kalyan- Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్?
అయితే మెగా హీరోలు ఎవరూ రాకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ రోజు చిరంజీవి, నాగబాబు ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ కానీ కనీసం కలవడం కానీ చేయలేదు.
- By Gopichand Published Date - 09:58 AM, Sun - 15 December 24

Pawan Kalyan- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ (Pawan Kalyan- Allu Arjun) ఇంటికి సీని ప్రముఖులు వచ్చి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే రానా, సుధీర్ బాబు, నాగ చైనత్య, నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరో వెంకటేశ్ బన్నీని పరామర్శించారు. అయితే నిన్నటి నుంచి మెగా వర్సెస్ అల్లు కుటుంబం అనే టాపిక్ నడుస్తోంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అనంతరం మెగా కుటుంబం నుంచి ఒక్క హీరో కూడా బన్నీ ఇంటికి రాలేదు. చిరంజీవి సతీమణి సురేఖ వచ్చి బన్నీకి చెప్పారు.
అయితే మెగా హీరోలు ఎవరూ రాకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ రోజు చిరంజీవి, నాగబాబు ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ కానీ కనీసం కలవడం కానీ చేయలేదు. దీంతో అల్లు, మెగా కుటుంబం మధ్య వార్ నడుస్తోన్నట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు కనీసం ట్వీట్ కూడా వేయకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తుంది.
Also Read: Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్?
మెగా వర్సెస్ అల్లు కుటుంబం వార్ రూమర్స్ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే సస్పెన్స్ నిన్నటి వరకు కొనసాగింది. కానీ శనివారం రాత్రి పవన్ కళ్యాణ్.. ఏపీ నుండి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే అల్లు, మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన అనంతరం.. మెగా కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్‌కి సన్నిహితంగా ఉండే వారు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి పవన్ వస్తే ఇరు కుటుంబాల మధ్య వార్ ఉందన్న రూమర్స్‌కు తెరపడుతుందా లేదా చూడాలి.