Pawan Kalyan Trivikram : పవన్ కళ్యాణ్.. త్రివిక్రం.. వాళ్లు ఎప్పుడు ఓకే అన్నా తను ఫిక్స్ అట..!
Pawan Kalyan Trivikram టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కలిసి సినిమా చేస్తే అది రికార్డు సృష్టిస్తుంది. జల్సాతో మొదలైన ఈ కాంబినేషన్ అత్తారింటికి దారేది సినిమాతో రికార్డులు
- Author : Ramesh
Date : 04-02-2024 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan Trivikram టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కలిసి సినిమా చేస్తే అది రికార్డు సృష్టిస్తుంది. జల్సాతో మొదలైన ఈ కాంబినేషన్ అత్తారింటికి దారేది సినిమాతో రికార్డులు సృష్టించారు. చివరిగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత పవన్ సినిమాను డైరెక్ట్ చేయలేదు కానీ ఆయన చేసిన సినిమాలకు మాటలు అందించాడు త్రివిక్రం.
పవన్ నటించిన భీంలా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రం వెనక హ్యాండ్ తెలిసిందే. పవన్ త్రివిక్రం కలిసి మరో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని నిర్మాత టీజి విశ్వ ప్రసాద్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రం ఇద్దరితో కలిసి తాము సినిమా ప్లాన్ చేస్తున్నామని వారు ఎప్పుడు ఓకే అంటే తాము అప్పుడు రెడీ అని అంటున్నారు విశ్వ ప్రసాద్.
అంతేకాదు ఈ ఇయర్ తమ ప్రొడక్షన్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. నెలకు ఒక సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. రవ్తేజ ఈగల్ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత విశ్వ ప్రసాద్ తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రభాస్ సినిమా రాజా సాబ్ కూడా పీపుల్ మీడియా ఫ్యాటరీ బ్యానర్ లోనే వస్తుంది. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశామని చెప్పారు విశ్వ ప్రసాద్.
Also Read : Urvasi Rautela : ఊర్వశి కేవలం పాటకే కాదట.. బాలయ్య సినిమాలో అమ్మడు కెవ్వు కేక పెట్టిస్తుందా..?