Film News: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్రో సినిమా వచ్చి నెల తిరగకముందే OG సినిమా టీజర్ తో ముందుకొచ్చారు. సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన OG టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
- By Praveen Aluthuru Published Date - 06:09 PM, Sun - 3 September 23

Film News: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్రో సినిమా వచ్చి నెల తిరగకముందే OG సినిమా టీజర్ తో ముందుకొచ్చారు. సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన OG టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముంబై బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా నటించారు.తాజాగా విడుదల చేసిన టీజర్లో పవన్ అద్భుత నటనకు వంద శాతం మార్కులు పడ్డాయి. ఈ టీజర్లో థమన్ ఆర్ఆర్ తో అదరగొట్టాడు. సుజిత్ డైరెక్షన్ బాగుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా OG తర్వాత పవన్ మరో సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది .
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. కాగా.. ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డితో కూడా ఓ సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ సినిమా కన్ఫర్మ్ అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఆమధ్య ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే సురేందర్ రెడ్డి ఏజెంట్ భారీ డిజాస్టర్ కావడంతో ఆ సినిమా క్యాన్సల్ అయినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా చేయనున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ భారీ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: Uttar Pradesh: ఐదవ ప్రేమికుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. చివరికి ఏం జరిగిందంటే?