BRO Movie Run Time: మెగా మల్టీస్టారర్ ‘BRO’ మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా..? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే..?
మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘బ్రో’ సినిమా రన్ టైమ్ (BRO Movie Run Time) వివరాలు లీక్ అయ్యాయి.
- By Gopichand Published Date - 02:48 PM, Fri - 14 July 23

BRO Movie Run Time: ప్రస్తుతం టాలీవుడ్‌లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య భారీగానే ఉంది. అయితే వాటిలో కొన్ని మాత్రమే మొదటి నుండి అంచనాలను పెంచుతున్నాయి. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన ‘BRO’సినిమా ఒకటి. మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘బ్రో’ సినిమా రన్ టైమ్ (BRO Movie Run Time) వివరాలు లీక్ అయ్యాయి.
మెగా మల్టీస్టారర్‌గా రాబోతోంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘BRO’. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ యోధ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కి రీమేక్‌గా రాబోతోంది.
జూలై 28న విడుదల
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘BRO’ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ చాలా తక్కువ సమయంలోనే పూర్తయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి వరుసగా చాలా అప్‌డేట్‌లు వస్తున్నాయి.
Also Read: Bigg Boss: నో ఆప్షన్.. కింగ్ నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్!
ప్రమోషన్స్.. భారీ రెస్పాన్స్
చనిపోయిన వ్యక్తికి మరో అవకాశం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘BRO’ సినిమా విడుదల తేదీ దగ్గర పడింది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు, పాటలు, టీజర్లను విడుదల చేసింది. వీటన్నింటికీ ప్రేక్షకులు, మెగా అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
బ్రో మూవీ రన్ టైమ్ వివరాలు
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ సినిమా ‘BRO’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ గురించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రన్ టైమ్ సోషల్ మీడియాలో లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ‘BRO’ సినిమా నిడివి 135 నిమిషాలు మాత్రమే అని సమాచారం. అంటే రెండు గంటల 15 నిమిషాల పాటు మూవీ ఉంటుంది.
పవన్ ఎంట్రీ
మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ‘BRO’లో పవన్ కళ్యాణ్ పాత్ర గురించిన సమాచారం కూడా లీక్ అయింది. దీని ప్రకారం సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతాడని సోషల్ మీడియాలో టాక్. అంతేకాదు మొత్తం 135 నిమిషాల సినిమాలో చివరి వరకు ఆయన పాత్ర కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘BRO’ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయి ధరమ్ తేజ్ సామాన్యుడిగా కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో కొంత మ్యాజిక్ కూడా కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్స్ లో వచ్చే సీన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతుంది.