Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. ఆ బాధ భరించలేక అంటూ!
- By Sailaja Reddy Published Date - 08:47 AM, Wed - 20 March 24

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఎన్నికలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హరీష్ శంకర్ ర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో పక్కనపెట్టేశారు ఈ మూవీ నీ పక్కన పెట్టేశారు హరీష్ శంకర్.
కానీ తాజాగా సడెన్ గా నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో పవన్ గాజు గ్లాస్ గురించి చెప్తూ.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ వేస్తాడు. అయితే ఇది పొలిటికల్ కి ఉపయోగపడాలనే ఇపుడు ఈ గ్లింప్స్, ఆ గాజు డైలాగ్ తో రిలీజ్ చేసారని తెలుస్తోంది. ఈ డైలాగ్ పై పవన్ స్పందించారు. నిన్న రాత్రి జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తారు.
ఈ రోజు వచ్చింది అనుకుంట గ్లింప్స్. ఆ గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ జరిగేటప్పుడు ఆ డైలాగ్ ఎందుకు రాసావ్ అని హరీష్ శంకర్ ని అడిగితే.. అందరూ మీరు ఓడిపోయారు, ఓడిపోయారు అంటే నేను ఒకటే చెప్పా గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్దీ పదునెక్కుతుంది. మీకు తెలియదు మా లాంటి ఫ్యాన్స్ ఇలాంటివి కోరుకుంటారు అని అన్నాడు. నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాను అని అన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.