Pawan Kalyan Hari Hara Veeramallu : రెండు భాగాలుగా వీరమల్లు.. పవర్ స్టార్స్ ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చిన నిర్మాత..!
Pawan Kalyan Hari Hara Veeramallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. నాలుగేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఇంకా పూర్తి
- Author : Ramesh
Date : 28-02-2024 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan Hari Hara Veeramallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. నాలుగేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. సినిమా ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది అనుకుని ఎదురుచూసిన ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమా గురించి మర్చిపోయారు. పవన్ తన పూర్తి ఫోకస్ అంతా ఆంధ్రా ఎలక్షన్స్ మీద పెట్టడంతో వీరమల్లు సినిమాకు టైం ఇవ్వలేకపోతున్నాడు.
ఈ సినిమా పై ఫ్యాన్స్ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అయితే అసలు సినిమా వస్తుందా రాదా అన్న కన్ ఫ్యూజన్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే. సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని చెప్పి షాక్ ఇచ్చాడు నిర్మాత ఏ.ఎం రత్నం. హరి హర వీరమల్లు సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా లేట్ అవుతున్నా తనకు ఎలాంటి ఇబ్బంది లెదన్నట్టుగా ఆయన ప్రవర్తన కనిపిస్తుంది.
లేటెస్ట్ గా సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ ఇన్ ఫర్మేషన్ చెప్పాడు నిర్మాత రత్నం. వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వస్తుందని.. సినిమా మీ అందరి అంచనాలకు మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. క్రిష్ డైరెక్షన్ లో 17వ శతాబ్ధం నాటి కథతో వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. వీరమల్లు పార్ట్ 1 2025 సంక్రాంతికి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Also Read : Sharwanand 35 : శర్వా సినిమాకు కొత్త టైటిల్ అదేనా..?