Pawan Daughter Aadhya : పవన్ కళ్యాణ్ కూతురు ఆటో లో ప్రయాణించడం ఏంటి..?
Pawan Daughter Aadhya : కోట్ల ఆస్తులు , సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ వారు మాత్రం సామాన్య వ్యక్తుల మాదిరే జీవించడం పట్ల అంత శభాష్ అని మాట్లాడుకుంటున్నారు
- Author : Sudheer
Date : 29-12-2024 - 1:34 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ నటుడు , జనసేనధినేత, ఏపీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు (Pawan Daughter Aadhya) ఆటో(Auto)లో ప్రయాణించడం ఏంటి..? ఇప్పుడు అభిమానులంతా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పవన్ కల్యాణ్ చిత్రసీమలో పవర్ స్టార్ అయ్యి ఉండి, ఒక్క సినిమాకు కోట్లాది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయిలో ఉండి, అలాగే జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నా ఆయన తో ఆయన కుటుంబ సభ్యులు సాధారణ జీవనాన్ని ఎంచుకోవడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. కోట్ల ఆస్తులు , సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ వారు మాత్రం సామాన్య వ్యక్తుల మాదిరే జీవించడం పట్ల అంత శభాష్ అని మాట్లాడుకుంటున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. కాశీ (వారణాసి) లో ఆద్యతో ఆటో రైడ్ అంటూ రేణు షేర్ చేశారీ వీడియో. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు.
తండ్రి ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా కూతురు మాత్రం ఎంత సింపుల్ గా నడుచుకుంటుందో చూడండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఆద్య మాత్రమే కాదు మిగతా ఇద్దరు పిల్లలు కూడా చాల సింపుల్ గా ఉంటారు. అకిరా అయితే తన తండ్రి , పెదనాన్న , అన్నయ్య ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పటికీ ఆడంబరాలు, విలాసాలకు అతీతంగా ఉంటాడు.
ఆటోలో ప్రయాణించిన @PawanKalyan కూతురు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్లో సింప్లిసిటీగా జీవనం సాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు. తాజాగా సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది కూతురు ఆద్య. తాజాగా తల్లి@iam_RenuDesai కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో pic.twitter.com/JnEdKB9qAo
— G🅰🅽🅴🆂H JANA 🆂🅴🅽🅰 (@WarWilliamson) December 28, 2024
Read Also : India vs Australia: ముగిసిన నాలుగో రోజు.. ఆసీస్‌ను ఆదుకున్న బౌలర్లు!