Ooruperu Bhairavakona will postpone : సందీప్ కిషన్ వెనక్కి తగ్గక తప్పట్లేదా.. భైరవ కోన మరోసారి వాయిదా..?
Ooruperu Bhairavakona will postpone సందీప్ కిషన్ హీరోగా వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా
- Author : Ramesh
Date : 28-01-2024 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
Ooruperu Bhairavakona will postpone సందీప్ కిషన్ హీరోగా వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. సినిమా ప్రచార చిత్రాల్లో భాగంగా రిలీజైన సాంగ్స్ ఇప్పటికే సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పరచగా ఈమధ్యనే వదిలిన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ పెంచాయి. సినిమా రిలీజ్ ఫిబ్రవరి 9న లాక్ చేయగా ఈగల్ వల్ల ఈ సినిమా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
We’re now on WhatsApp : Click to Join
సంక్రాంతి నుంచి ఈగల్ ని ఆపినందుకు నిర్మాతల మండలి ఆ సినిమాకు ఫిబ్రవరి 9 సోలో రిలీజ్ ఇచ్చారు. అయితే ఆ డేట్ న వస్తున్న భైరవ కోన సినిమాకు అన్యాయం జరుగుతుందని భావించి మరోసారి నిర్మాతల మండలి ఈ సినిమా యూనిట్ తో సంప్రదింపులు జరిపారు. సినిమాను ఫిబ్రవరి 9 న వాయిదా వేసుకుంటే వీరికి కూడా సోలో రిలీజ్ డేట్ ఇచ్చేలా ప్లాన్ చేశారు.
అలా ఫిబ్రవరి 16న ఈ సినిమా రిలీజ్ చేయమని చెప్పారట. ఫిబ్రవరి 16న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, గోపీచంద్ భీమ సినిమాలు రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి.
సో ఇప్పుడు ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవ కోన సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే చిత్ర యూనిట్ సినిమా వారం వాయిదా పడినట్టు ఇంకా ప్రకటించలేదు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ ఈ సినిమా నిర్మించారు.
Also Read : Prabhas Kannappa : కన్నప్పకి డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. మంచు విష్ణు ప్లానింగ్ అదే..!