Onemore Raviteja Movie Canceld Mass Raja Fans Dissappointed : రవితేజ ఏమయ్యాడు అనుదీప్.. మాస్ కా దాస్ తో సినిమా ప్లాన్..!
రవితేజతో సినిమా చేస్తాడని అనుకున్న అనుదీప్ విశ్వక్ సేన్ తో సినిమా ఒకటి లైన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
- Author : Ramesh
Date : 05-07-2024 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. జారిరత్నాలు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్ ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కాతికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న అనుదీప్ రవితేజతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం రవితేజ అనుదీప్ (Anudeep) సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందట. రవితేజతో సినిమా చేస్తాడని అనుకున్న అనుదీప్ విశ్వక్ సేన్ తో సినిమా ఒకటి లైన్ చేస్తున్నాడని తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ ఈమధ్య ఇలా కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం అలా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది.
అంతకుముందు కూడా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తో రవితేజ సినిమా ఒకటి ప్లాన్ చేశారు. ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి ఒక రేంజ్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇక ఇప్పుడు అనుదీప్ సినిమా కూడా అదేవిధంగా ఆగిపోయిందని తెలుస్తుంది. రవితేజ ఇలా క్రేజీ కాంబినేషన్స్ అన్నీ వదిలి పెట్టడం ఫ్యాన్స్ లో కూడా నిరాశ కలిగిస్తుంది.