OG Box Office : ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న OG ..ప్రీమియర్లతోనే సరికొత్త రికార్డు
OG Box Office : నార్త్ అమెరికా మార్కెట్(US Market)లో 'ఓజీ' అరుదైన రికార్డు సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.26 కోట్లు) వసూళ్లు సాధించడం ద్వారా ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది
- By Sudheer Published Date - 11:45 AM, Thu - 25 September 25

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan) అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG)సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
నార్త్ అమెరికా మార్కెట్(US Market)లో ‘ఓజీ’ అరుదైన రికార్డు సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.26 కోట్లు) వసూళ్లు సాధించడం ద్వారా ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ విజయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి అభిమానులతో పంచుకుంది. పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్ అవతార్, సుజీత్ స్టైలిష్ టేకింగ్ ఈ వసూళ్లకు కారణమని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో ఆకట్టుకోగా, ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా మెప్పించింది. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా థమన్ అందించిన నేపథ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. సోషల్ మీడియా అంతా *ఓజీ* ఫీవర్‌తో నిండిపోవడంతో, చాలా కాలం తర్వాత పవన్‌ను పూర్తిస్థాయి మాస్ పాత్రలో చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం *ఓజీ* తన హవాను బాక్సాఫీస్ వద్ద శక్తివంతంగా కొనసాగిస్తోంది.
OG KA DESTRUCTION 🤙🏻🤙🏻🤙🏻🤙🏻🔥🔥🔥#TheyCallHimOG hits $3M+ North America Premieres Gross & counting ……#OG pic.twitter.com/1uLbkYBcWF
— DVV Entertainment (@DVVMovies) September 25, 2025